● సీపీ గౌస్ ఆలం
కరీంనగర్‌రూరల్: రేపటి వైద్యులుగా మారనున్న మెడికల్ విద్యార్థులకు ప్రాక్టికల్ విజ్ఞానం ఎంతో అవసరమని కరీంనగర్ సీపీ గౌస్ అలం అన్నారు. ఆదివారం కరీంనగర్ మండలం నగునూరులో ప్రాణా–2026 పేరిట నిర్వహిస్తున్న అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కాన్ఫరెన్స్ ముగింపు సమావేశంలో సీపీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెడికల్ కాన్ఫరెన్స్‌లు వైద్య విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. ప్రతిమ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్ డాక్టర్ హాసిని మాట్లాడు తూ జీవశక్తి, ఉత్సాహం, లక్ష్యం మూడు విలు వలతో ప్రాణా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం వైద్య విద్యార్థులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ప్రిన్సిపాల్ జాన్ ఇజ్రాయిల్, వైస్ ప్రిన్స్‌పాల్ కిషన్‌రెడ్డి, సీఏవో రాంచందర్‌రావు, మెడికల్ సూపరింటెండెంట్ సీఎన్ ప్రసాద్, రిజిస్ట్రార్ ప్రసాద్‌రావు, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
స్వశక్తి మహిళా నిరక్షరాస్యులకు పరీక్ష
కరీంనగర్ కార్పొరేషన్: జిల్లాలోని మున్సిపాలి టీల వారీగా గుర్తించిన స్వశక్తి సంఘాల్లోని నిరక్షరాస్యులైన మహిళలకు ఆదివారం మెప్మా ఆధ్వర్యంలో అక్షరాస్యత పరీక్ష నిర్వహించారు. నగరంలో ఏర్పాటు చేసిన 89 కేంద్రాల్లో 5,344 మంది స్వశక్తి మహిళలు పరీక్షకు హాజరయ్యా రు. కరీంనగర్ నగరపాలకసంస్థ, హుజూరాబా ద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీల పరిధిల్లో ఉల్లాస్ పథకం కింద స్వయం సహా యక సంఘాల్లో సభ్యులుగా ఉన్న 13,647 మంది నిరక్షరాస్యులను గుర్తించారు. వీరందరిని అక్షరాస్యులుగా మార్చేందుకు గతంలో ప్రత్యేక బోధనా తరగతులు నిర్వహించారు. తరగతుల్లో అక్షరాలు నేర్చుకొన్న 6,173 మందికి ఆదివారం వయోజన విద్య విభాగం ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించగా, 5,344 మంది హాజరయ్యారు. మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ స్వరూపారాణి హౌసింగ్‌బోర్డుకాలనీలోని ప్రభుత్వ పాఠశాల, కార్ఖానగడ్డ,రాంనగర్, సప్తగిరికాలనీల్లోని పరీక్షా కేంద్రాలను సందర్శించారు. 89 కేంద్రాల్లో 221 మంది సమాఖ్య ప్రతినిధులు ఇన్విజిలేటర్లుగా విధులు నిర్వహించారు.
బీజేపీ భావాజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
కొత్తపల్లి(కరీంనగర్): బీజేపీ సిద్ధాంతం, భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని పార్టీ రాష్ట్ర ప్రశిక్షణ కమిటీ సభ్యులు రంజిత్ మోహన్, రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి శ్రీధర్, రాణి రుద్రమ పిలుపునిచ్చారు. పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియా న్‌లో భాగంగా కొత్తపల్లిలో జరుగుతున్న వెస్ట్‌జోన్, కొత్తపల్లి జోన్, కొత్తపల్లి రూరల్ బీజేపీ శ్రేణుల శిక్షణ శిబిరం ఆదివారం ముగిసింది. ముఖ్య అతిథులుగా హాజరైన పలువరు మాట్లాడుతూ బలమైన బీజేపీ సిద్ధాంతంతోనే నేడు పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగిందన్నారు. అనంతరం ప్రధాని మోడీ 132వ మన్ కి బాత్ ను వీక్షించారు. నాయకులు బాస సత్యనారా యణ రావు, కన్నబోయిన ఓదెలు, గుజ్జ శ్రీని వాస్, కార్పొరేటర్ వాసాల రమేశ్, జిల్లా ఉపాధ్యక్షుడు రంగు భాస్కరాచారి పాల్గొన్నారు.
నేటి నుంచి హెచ్‌పీవీ వ్యాక్సినేషన్
కరీంనగర్: జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో సోమవారం నుంచి హెచ్‌పీవీ టీకాలు వేస్తామని డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటరమణ, డీఐవో డాక్టర్ సాజిదా అతహరి తెలిపారు. ఈ కార్యక్రమం ప్రతిరోజూ అన్ని పీహెచ్‌సీల్లో ఉంటుందన్నారు. టీకా కోసం బాలికలు తప్పనిసరిగా తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకులతో కలిసి రావాల్సి ఉంటుందని, ఆధార్ కార్డు వెంట ఉంచుకోవాలన్నారు.


