గృహప్రవేశాలకు ఏర్పాట్లు చేయాలి | - | Sakshi
Sakshi News home page

గృహప్రవేశాలకు ఏర్పాట్లు చేయాలి

Mar 29 2026 7:05 AM | Updated on Mar 29 2026 7:05 AM

తిమ్మాపూర్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో భాగంగా ప్రారంభించిన ఇళ్ల నిర్మాణం పూర్తిచేసుకుని గృహప్రవేశాలకు సిద్ధమయ్యేలా చూడాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. మండలంలోని నుస్తులాపూర్‌ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను శనివారం పరిశీలించారు. లబ్ధిదారులు తుమ్మనవేని రజిత, కుంటు రాధతో మాట్లాడారు. ఇంటి నిర్మాణానికి ఇప్పటివరకు అయిన ఖర్చు, ప్రభుత్వం నుంచి వచ్చిన బిల్లుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. గృహ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసుకొని పూర్తి లబ్ధి పొందాలని సూచించారు. ఈ సందర్భంగా హౌసింగ్‌, పంచాయతీరాజ్‌ అధికారులతో మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసుకునేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని అన్నారు. వారికి ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించాలని అన్నారు. ఇళ్ల నిర్మాణానికి ఇసుక సరఫరాలో ఇబ్బందులు రాకుండా చూడాలని ఎంపీడీవోను ఆదేశించారు. మోడల్‌ గ్రామాలు, మొదటి దఫాలో ఎంపికై న లబ్ధిదారుల ఇళ్లు నూరు శాతం పూర్తయ్యేలా చూడాలని అన్నారు. కలెక్టర్‌ వెంట స్థానిక సర్పంచ్‌ తుమ్మనపల్లి సంధ్య శ్రీనివాసరావు గృహనిర్మాణ సంస్థ ప్రాజెక్టు పిడి శ్రీనివాస్‌, డీఈ వెంకటరమణ, ఏఈ శ్రీజ, ఎంపీడీవో మల్హోత్రా, తహసిల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.

మానేరు రివర్‌ ఫ్రంట్‌ పనుల పరిశీలన

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరంలోని ఎల్‌ఎండీ రిజర్వాయర్‌ దిగువన నిర్మిస్తున్న మానేరు రివర్‌ ఫ్రంట్‌ పనులను శనివారం కలెక్టర్‌ చిత్రా మిశ్రా పరిశీలించారు. మున్సిపల్‌, రెవెన్యూ, నీటిపారుదలశాఖ, ఇంజినీరింగ్‌ అధికారులతో కలిసి రివర్‌ ఫ్రంట్‌ బ్యారేజీ నిర్మాణ స్థలాన్ని సందర్శించారు. రివర్‌ ఫ్రంట్‌ నిర్మాణ అంచనా వ్యయం, చేసిన పనుల వివరాలు, చేయాల్సిన నిర్మాణాలు తదితర అంశాలను అధికారులు కలెక్టర్‌కు వివరించారు. రివర్‌ ఫ్రంట్‌ నిర్మాణంలో భాగంగా పర్యాటక అభివృద్ధిలో భాగంగా ఏయే నిర్మాణాలు, ఎంత విస్తీర్ణంలో, ఎక్కడ చేపడుతున్నారనే విషయాలను తెలుసుకొన్నారు. నగరపాలకసంస్థ కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌, ఆర్‌డీఓ మహేశ్వర్‌, నీటిపారుదలశాఖ ఎస్‌ఈ రమేశ్‌ పాల్గొన్నారు.

ఇందిరమ్మ లబ్ధిదారుల సమస్యలు పరిష్కరించాలి

కలెక్టర్‌ చిత్రా మిశ్రా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement