కరీంనగర్ కార్పొరేషన్: మూడు రోజుల్లో వందశాతం ఆస్తిపన్ను వసూలు చేయాలని నగర పాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ ఆదేశించారు. శనివారం కళాభారతిలో రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్, శానిటేషన్ విభాగాల అధికారులు, వార్డు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025–26 ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఉన్న మూడు రోజుల్లో వందశాతం వసూలు చేయాలన్నారు. ప్రతి రోజు రూ.2.50 కోట్లు వసూలు చేయాలన్నారు. టాప్ 200 మంది మొండి బకాయిదారులతో పాటు కమర్షియల్, మిక్స్‌డ్, డబుల్ నెంబర్ ప్రాపర్టీలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి వరకు ప్రతి అసెస్మెంట్‌ను సందర్శించి, పన్నులు కట్టించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మొండి బకాయి దారులు పన్నులు చెల్లించకుంటే చట్ట ప్రకారం ప్రాపర్టీలను సీజ్ చేయాలని ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్లు ఖాదర్ మొహియొద్దీన్, వేణు మాధవ్ పాల్గొన్నారు.
మూడు రోజులు గడువు.. ప్రతి రోజూ రూ.2.50 కోట్లు లక్ష్యం
నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్


