గంగాధర: రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్ల కంటిచూపు కీలకమని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం పేర్కొన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహిస్తున్న రెండో దశ అరైవ్– అలైవ్ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలోని ఓ ఫంక్షన్ హాలులో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీపీ మాట్లాడుతూ డ్రైవర్లు కంటిచూపుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. తద్వారా తమ ప్రాణాలతో పాటు ప్రయాణికుల ప్రాణాలకు భద్రత కల్పించిన వారవుతారన్నారు. ప్రతి వాహన డ్రైవర్ తరచూ కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఏసీపీ విజయ్‌కుమార్, చొప్పదండి సీఐ ప్రదీప్‌కుమార్, ఎంవీఐలు రవికుమార్, రజిని, ఎంపీడీవో రాము, తహసీల్దార్ రజిని, ఎస్సైలు వంశీకష్ణ, నరేశ్‌రెడ్డి, రాజు, సర్పంచులు వేముల భాస్కర్, ముద్దం నగేశ్, బీర్ల ఆనందం, రేండ్ల శ్రీనివాస్, దూలం కల్యాణ్ పాల్గొన్నారు.


