సమన్వయంతోనే సంఘాల అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతోనే సంఘాల అభివృద్ధి

Mar 29 2026 7:05 AM | Updated on Mar 29 2026 7:05 AM

చొప్పదండి: సహకార సంఘాల పాలకవర్గాలు, సిబ్బంది మధ్య సమన్వయంతోనే సొసైటీల అభివృద్ధి జరుగుతుందని జాతీయ ఉత్తమ పీఏసీఎస్‌ అవార్డు గ్రహీత వెల్మ మల్లారెడ్డి అన్నారు. పట్టణంలోని పీఏసీఎస్‌ వార్షిక సర్వసభ్య సమావేశం పర్సన్‌ ఇన్‌చార్జి జమునారాణి అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సందర్భంగా తాజాగా గడువు ముగిసిన పాలకవర్గానికి సంఘ సభ్యులు సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భగా మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఎరువుల గోదాం నిర్మాణం, వడ్ల కొనుగోలు కేంద్రాలు, అయిదున్నర ఎకరాలలో సోలార్‌ పవర్‌ ప్లాంటు నిర్మాణం, రైతులకు అత్యాధునిక విధానంలో డ్రోన్‌ స్ప్రే సౌకర్యం వంటి అంశాలు చొప్పదండి సంఘానికి ప్రత్యేకతలుగా నిలుస్తాయన్నారు. పర్సన్‌ ఇన్‌చార్జి మాట్లాడుతూ రుణాలు తీసుకొని చెల్లించని వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. సకాలంలో రుణాలు చెల్లించాలని కోరారు. ఈ సందర్భంగా వార్షిక నివేదికను చదివి వినిపించారు. గుర్రం ఇంద్రసేనారెడ్డి, కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, పెరుమాండ్ల గంగయ్యగౌడ్‌, ముద్దం మహేశ్‌గౌడ్‌, కళ్లెం తిరుపతిరెడ్డి, ఇప్పనపల్లి సాంబయ్య, ముద్దం తిరుపతిగౌడ్‌, గుర్రం రాజేందర్‌రెడ్డి, పిట్టల వెంకటేశ్‌, రాజన్నల రాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement