మల్యాల: హైదరాబాద్‌కు చెందిన పార్కంపేట వెంకటేశ్ దంపతులు శుక్రవారం కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు ఉచిత నిత్యాన్నదానం కోసం తమవంతుగా రూ.1.50లక్షలు అందజేశారు. ఈవో అంజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇద్దరు యువకుల అరెస్ట్
మానకొండూర్: మానకొండూర్ మండలంలోని జగ్గయ్యపల్లి గ్రామానికి చెందిన అనిల్‌రెడ్డి, లింగాపూర్ గ్రామానికి చెందిన భరత్ గంజాయి సేవిస్తుండగా పట్టుకున్నట్లు సీఐ శ్రీలత శుక్రవారం తెలిపారు. మానకొండూర్ రైస్‌మిల్లుల వద్ద గంజాయి సేవిస్తుండగా పట్టుకుని రిమాండ్‌కు పంపినట్లు వివరించారు.


