రామగిరి: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగెపల్లి గ్రామానికి చెందిన మట్ట రాజయ్య(48)ఉరి వేసుకుని అత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రాజయ్యమేసీ్త్ర పనిచేస్తున్నాడు. కొందరి వద్ద డబ్బులు తీసుని ఇళ్లు నిర్మిస్తూ ఇచ్చేవాడు. ఈక్రమంలో అప్పుల పాలయ్యాడు. కొందరు యజమానులకు ఇళ్లు నిర్మించి ఇవ్వకపోవడంతో వారు ఇళ్లు ఎప్పుడు కట్టిస్తావని తరచూ అడిగారు. మనస్తాపం చెందిన రాజయ్య రత్నాపూర్‌లో స్లాబ్‌వర్క్ ఉందని చెప్పి శుక్రవారం ఇంట్లోంచి వెళ్లిపోయాడు. మధ్యాహ్న భోజనం కోసం ఇంటికి వెళ్లలేదు. భార్య ఓదేమ్మ ఫోన్‌చేసినా లిఫ్ట్ చేయలేదు. తన తమ్ముడు రాజాపూర్‌లోని కలవేన సంపత్‌కు ఆమె ఫోన్‌చేసి విషయం చెప్పింది. అతడు రాజాపూర్‌లోని ఓ కొత్త ఇంటికి వెళ్లి చూడగా తలుపులు పెట్టి ఉన్నాయి. కిటికీలోంచి చూడగా తాడుతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. తన భర్త మరణంపై అనుమానాలు లేవని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.
ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్ నమోదు
సమాచారం అందుకున్న ఎస్సై శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలి నుంచి అక్కడే ఫిర్యాదు స్వీకరించి అప్పటికప్పుడే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్ పత్రాన్ని బాధితురాలికి అందజేశారు. బాధితులకు ఇబ్బందులు లేకుండా ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తున్నామని ఎస్సై వివరించారు.
రుద్రంగిలో చిరుత కలకలం
రుద్రంగి(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన నాగారం బొర్రయ్య రైతు పొలం వద్ద ఉన్న కాపాల కుక్కపై చిరుత దాడి చేసి చంపేసింది. రోజు మాదిరిగానే గురువారం రాత్రి ఆవులు, గేదెలను పాకలో కట్టేసి, రెండు కుక్కలను కాపలాగా కట్టేశాడు. శుక్రవారం ఉదయం వెళ్లి చూడగా ఒక కుక్కను చిరుత చంపివేసింది. కుక్కను రూ.8 వేలకు కొన్నట్లు రైతు బొర్రయ్య తెలిపాడు. గతంలోనూ ఇదే ఏరియాలో లేగదూడపై చిరుత దాడి చేసి చంపిందని రైతులు తెలిపారు. ఈ విషయంపై ఫారెస్టు ఆఫీనర్ రవీందర్‌ను వివరణ కోరగా చిరుత ఆనవాళ్లు కనిసించలేదన్నారు. కుక్కపై దాడి చేసిందని హైనా కావచ్చని పేర్కొన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
రుద్రంగి మండల కేంద్రంలోని అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తూ కుక్కను చంపిన ప్రదేశాన్ని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై మోతీరాం పరిశీలించారు. వారు మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిరుత సంచరించినట్లు ఆనవాళ్లు కనిపిస్తే వెంటనే పోలీస్, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.


