జనం నుంచి వనంలోకి..
వీణవంకలో వనంలోకి వెళ్తున్న తల్లులు
రేకుర్తిలో భక్తుల రద్దీ
కరీంనగర్ కల్చరల్/కొత్తపల్లి/వీణవంక: జిల్లాలో సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా ముగిసింది. బుధవారం ప్రారంభమైన వేడుక శనివారం తల్లుల వన ప్రవేశంతో సంపూర్ణమైంది. రేకుర్తి, చింతకుంట, మల్కాపూర్, నగునూరు, ఇరుకుల్ల, వేగురుపల్లి, కేశవపట్నం, వీణవంకతో పాటు తదితర ప్రాంతాల్లో నాలుగు రోజులుగా వైభవంగా జరిగిన శ్రీ సమ్మక్క– సారలమ్మ జాతర శనివారంతో ముగిసింది. వనం వీడి జనంలోకి వచ్చిన తల్లులకు బుధ, గురు, శుక్రవారాలతో పాటు శనివారం సైతం ప్రత్యేక పూజలు చేశారు. ఎత్తుబంగారాలు.. కొబ్బరికాయల మొక్కులు చెల్లించారు. సాయంత్రం తల్లుల వన ప్రవేశంతో జాతర ముగిసింది. దీంతో రెండేళ్లకోసాచి వచ్చే జాతరకు మళ్లొస్తాం తల్లీ అంటూ.. భక్తులు సైతం తిరుగుపయనం అయ్యారు. అమ్మవార్ల వద్ద ఏర్పాటు చేసిన హుండీలు, భక్తులు సమర్పించిన బంగారం, చీరె సారెలను నిర్వాహకులు తరలించారు.
జనం నుంచి వనంలోకి..
జనం నుంచి వనంలోకి..


