ప్రేమతో వద్దు అని చెబుదాం!
పిల్లలను గారాబం చేసే విషయమై ‘సాక్షి’ ఆధ్వర్యంలో 100 మందితో
సర్వే నిర్వహించగా.. వారు స్పందించిన తీరు ఇలా..
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలో ఇటీవల 12 ఏళ్ల బాలుడు ఫోన్ కొనివ్వమని అమ్మను అడిగాడు. జీతం వచ్చాక ఇప్పిస్తానని చెప్పినా.. వినలేదు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు.
పెద్దపల్లి జిల్లాకు చెందిన పదోతరగతి చదువుతున్న ఓ బాలుడు బైక్ కొనివ్వాలని నెలరోజులుగా తల్లితండ్రులతో గొడవపడుతున్నాడు. ఇది భరించలేని పేరెంట్స్ ఇటీవల రూ. 2 లక్షల విలువైన స్పోర్ట్స్’ బైక్ కొనిచ్చారు. గతనెల బైక్‌పై ఓవర్ స్పీడ్‌తో వెళ్తున్న బాలుడు రోడ్డు పక్కనున్న చెట్టుకు ఢీకొని మృతిచెందాడు.
55
వెంటనే కొనిస్తాను
మీ పిల్లలు ఏదైనా
అడిగితే మీరు
ఏంచేస్తారు
45
పరిస్థితిని బట్టి కొనిస్తాను
64
పిల్లల కోరికలను
ఎలా
నియంత్రిస్తారు...
ప్రేమతో అర్థం చేయించాలి
36
అవసరానికనుగుణంగా
కఠినంగా వ్యవహరించాలి
63
పిల్లలకు
అడిగిందల్లా
కొనిస్తారా..
అవును
37
66
ఉంది
మీ పిల్లలపై మీరు చేసే గారాబంప్రభావం
34
లేదు
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ బాలిక ఫోన్‌కొనివ్వాలని తండ్రిని వేధించింది. పేదరికంలో కొనివ్వలేని పరిస్థితి ఉన్నా.. అప్పుచేసి రూ. 15 వేల ఫోన్ కొనిచ్చాడు. రీల్స్ చూడడం అలవాటు చేసుకున్న ఆ బాలిక పెళ్లయి ఇద్దరు పిల్లలున్న ఓ వ్యక్తి వలలో పడింది. జీవితం ఛిన్నాభిన్నం చేసుకుంది.
ప్రేమతో వద్దు అని చెబుదాం!


