రూ.20లక్షలు సీజ్
● రగుడు చెక్‌పోస్ట్ వద్ద ముమ్మర తనిఖీలు
సిరిసిల్ల/సిరిసిల్లఅర్బన్: సిరిసిల్ల పట్టణ పరిధిలోని రగుడు ఎస్‌ఎస్‌టీ చెక్‌పోస్టు వద్ద శుక్రవారం రూ.20లక్షలు సీజ్ చేసినట్లు పట్టణ సీఐ కృష్ణ, ఎస్‌ఎస్‌టీ ఇన్‌చార్జి జి.ఆనంద్ తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా వేములవాడకు చెందిన గణాచారి సంభాషివ్ తన కారులో రూ.20లక్షలు తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుకున్న నగదును ఎన్నికల నిబంధనల ప్రకారం ఏపీవో పంచనామా చేసి, సాక్షుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ చెక్‌పోస్టును జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు, వ్యయ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, రాజ్‌కుమార్ తనిఖీ చేశారు. వివిధ రిజిస్టర్లు పరిశీలించారు. తనిఖీల్లో నోడల్ అధికారులు నవీన్‌కుమార్, భారతి తదితరులు పాల్గొన్నారు.


