మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ నర్సు ఇంట్లో విషాదం
మెట్‌పల్లి: మెట్‌పల్లి మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ ఎర్రొల నర్సు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె కుమారుడు వంశీ(33) శుక్రవారం హైదరాబాద్‌లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఎన్నికల్లో స్థానిక 23వార్డు నుంచి ఆమె భర్త, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హన్మాండ్లు ఆ పార్టీ తరపున నామినేషన్ వేశారు. గెలుపు కోసం భర్తతో కలిసి వార్డులో ఇంటింటి ప్రచారం చేస్తుండగా, కుమారుడు మృతి చెందినట్లు సమాచారమందడంతో వారు శోక సంద్రంలో మునిగిపోయారు. నర్సు దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు వంశీ ఉన్నాడు. ముగ్గురికి వివాహాలు జరిగాయి. వంశీకి భార్యతో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న ఆయన..నాలుగు రోజుల క్రితమే కుటుంబ సభ్యులతో కలిసి మెట్‌పల్లికి వచ్చి వెళ్లిపోయారు. అంతలోనే అక్కడ ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం స్థానికులను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది.
కాంగ్రెస్ అభ్యర్థిగా భర్త హన్మాండ్లు నామినేషన్
అంతలోనే కుమారుడు వంశీ బలవన్మరణం


