కేటీఆర్‌ కాన్వాయ్‌ తనిఖీ | - | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌ కాన్వాయ్‌ తనిఖీ

Dec 11 2025 9:25 AM | Updated on Dec 11 2025 9:25 AM

కేటీఆ

కేటీఆర్‌ కాన్వాయ్‌ తనిఖీ

తంగళ్లపల్లి: సిరిసిల్లలో పర్యటనకు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు కాన్వాయ్‌ను బుధవారం జిల్లా శివారులోని జిల్లెల్ల చెక్‌పోస్టు వద్ద అధికారులు తనిఖీ చేశారు. పంచాయతీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉండడంతో నిబంధనల ప్రకారం కేటీఆర్‌ కాన్వాయ్‌ వాహనాలను తనిఖీ చేసి తర్వాత అనుమతించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ కారు దిగి అధికారులకు సహకరించారు.

14న తేజస్‌ స్కాలర్‌షిప్‌ టాలెంట్‌ టెస్ట్‌

కొత్తపల్లి(కరీంనగర్‌): కొత్తపల్లిలోని తేజస్‌ ఐఐటీ/నీట్‌ అకాడమీ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు ఈనెల 14న ఉదయం 11 నుంచి 12 గంటల వరకు తేజస్‌ స్కాలర్‌షిప్‌ టాలెంట్‌ టెస్ట్‌–2025ను నిర్వహిస్తున్నట్లు అకాడమీ చైర్మన్‌ సీహెచ్‌ సతీశ్‌రావు తెలిపారు. కొత్తపల్లిలోని తేజస్‌ జూనియర్‌ కళాశాలలో బుధవారం పోస్టర్‌ ఆవిష్కరించి మాట్లాడారు. 10వ తరగతి విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు ఈ టెస్ట్‌ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విద్యార్థులకు ట్యూషన్‌ ఫీజులో 10 నుంచి 50 శాతం వరకు రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వివరాలకు 81063 10960, 81063 66661, 98494 66661లో సంప్రదించాలని తెలిపారు. ప్రిన్సిపాల్‌ జి.కిషన్‌రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.

కేటీఆర్‌ కాన్వాయ్‌ తనిఖీ1
1/1

కేటీఆర్‌ కాన్వాయ్‌ తనిఖీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement