పంచాయతీ
మొదటి దశ ఎన్నికలు జరిగే పంచాయతీలు
ఉమ్మడి జిల్లాలో 389 గ్రామాల్లో ఎన్నికలు నేడు
సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసుల ప్రత్యేక దృష్టి
20 గ్రామాల్లో ఇప్పటికే సర్పంచ్ పదవులు ఏకగ్రీవం
500 లోపు ఓట్లున్న గ్రామాల్లో మధ్యాహ్నానికే ఫలితాలు
పలు గ్రామాల్లో ఉప సర్పంచ్ ఎన్నిక జాప్యమయ్యే అవకాశాలు
ఎన్నికల ర్యాలీలపై నిషేధం: సీపీ గౌస్ ఆలం
ఇయ్యాల్నే తొలివిడత
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్:
గ్రామ పంచాయతీ తొలి దశ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,224 గ్రామాలకు గాను మొదటి విడతలో భాగంగా 389 గ్రామాల్లో అధికారులు పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలవారీగా కలెక్టర్లు ఏర్పాట్లు సిద్ధం చేశారు. తొలి దశ ఎన్నికల్లో భాగంగా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. బుధవారం జిల్లా, మండలాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ సిబ్బంది, పోలింగ్ సామగ్రితో మధ్యాహ్నమే బయల్దేరి ఎన్నికలు జరగనున్న గ్రామాలను చేరుకున్నారు. కరీంనగర్ 28 గ్రామాలు, పెద్దపల్లిలో 15, జగిత్యాల 21, సిరిసిల్లలో 41 గ్రామాలు 500 లోపు ఓట్లున్నాయి. తక్కువ ఓటర్ల కారణంగా వీటి ఫలితాలు మధ్యాహ్ననికి వెలువడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
కరీంనగర్‌లో ఇలా..
కరీంనగర్‌లో తొలి దశలో భాగంగా 5 మండలాల్లోని 92 గ్రామాల్లో ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందులో 3 గ్రామాల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవం కాగా.. 866 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 276 వార్డులు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 590 వార్డులకు యధావిధిగా ఎన్నికలు జరగనున్నాయి. చొప్పదండి, గంగాధర, రామడుగు, కొత్తపల్లి మండలాల్లోని జెడ్పీ హైస్కూళ్లలో, కరీంనగర్ రూరల్‌కు సంబంధించి కరీంనగర్ ఎంపీడీవో కార్యాలయంలో డిస్ట్రిబ్యూష న్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలను బుధవారం స్వయంగా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. పోలింగ్ బూత్‌కు వెళ్లనున్న ఎన్నికల సిబ్బందితో మాట్లాడారు. ఎన్నికల నియమావళి ప్రకారం నడుచుకోవాలని సూచించారు. ఎన్నికల సామగ్రి, చెక్ లిస్ట్‌ను తనిఖీ చేసుకోవాలని, ఇబ్బందులుంటే రూట్ ఆఫీసర్‌ను సంప్రదించాలని ఆదేశించారు.
పంచాయతీ
పంచాయతీ


