చొప్పదండి పరిశోధకుడికి అంతర్జాతీయ గుర్తింపు
చొప్పదండి: పోరస్ మీడియంలో హైపర్బోలిక్ టాంజెంట్ నానోఫ్లూయిడ్ ప్రవాహంపై పరిశోధనకు గాను చొప్పదండికి చెందిన కళ్లెం శ్రీనివాస్‌రెడ్డికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. హైపర్బోలిక్ టాంజెంట్ ప్లోలో కంప్యూటేషనల్ అనాలిసిస్ అనే శీర్షికతో శ్రీనివాస్‌రెడ్డి చేసిన పరిశోధనకు ప్రతిష్టాత్మక క్యూ1, క్యూ2 ర్యాంక్ గల జర్నల్స్‌లో పదికి పైగా పరిశోధనా పత్రాలు ప్రచురితమయ్యాయి. శ్రీనివాస్‌రెడ్డి చేసిన అధ్యయనాలు అణు రియాక్టర్ శీతలీకరణ, మెటలర్జీ, భౌగోళిక ప్రాసెస్‌లు, అంతరిక్ష సాంకేతికత వంటి అనేక అధునాతన పరిశ్రమల్లో ఉపయోగపడే విలువైన మార్గదర్శకాలను అందిస్తున్నాయి. నాన్‌లీనియర్ సమీకరణాలను పరిష్కరించడంలో ఉన్న క్లిష్టతను అధిగమించి ఈ పరిశోధన ద్వారా థర్మో ఫ్లూయిడ్ వ్యవస్థల రూపకల్పన, విశ్లేషణ, ఆప్టిమైజేషన్‌లో గణనీయమైన పురోగతిని సాధించినట్లు శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శాసీ్త్రయ నైపుణ్యంతోపాటు పరిశోధనలో నవ్యత, అత్యుత్తమ ప్రచురుణా ప్రమాణాలు కలగలిసిన ఈ అధ్యయనం భారతీయ పరిశోధకుల అంతర్జాతీయ ప్రతిష్టను మరింతగా పెంచిందని అభిప్రాయపడ్డారు. గీతం యూనివర్శిటీ ద్వారా ఆయన ఈ పరిశోధనలో పాల్గొన్నారు. జూలై 30న మాథమెటిక్స్, స్టాటిక్స్ విభాగం ద్వారా ఆయన పరిశోధనా పత్రం సమర్పించారు.


