రూ.5లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రావడం సంతోషం
● చాడ వెంకట్‌రెడ్డి
చిగురుమామిడి: గ్లోబల్ సమ్మిట్‌లో రాష్ట్రానికి రూ.5లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల రావడం సంతోషించదగిందని సీపీఐ జాతీయ మాజీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. చిగురుమామిడిలోని ముస్కు రాజిరెడ్డి స్మారక భవనంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భవిష్యత్‌లో యువతకు వృత్తి నైపుణ్యంలో శిక్షణతోపాటు నిరుద్యోగులకు లక్షన్నర ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. ఒక టీం లీడర్‌గా సీఎం రేవంత్‌రెడ్డి సక్సెస్ అయినట్లు అని అన్నారు. సీపీఐ బలపర్చిన అభ్యర్థులను అధిక సంఖ్యలో గెలిపించాలని కోరారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందె స్వామి, జిల్లా కార్యవర్గ సభ్యుడు బోయిని అశోక్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు గూడెం లక్ష్మి, తేరాల సత్యనారాయణ, మండల సహాయకార్యదర్శి బూడిద సదాశివ, నాయకులు బొలుమల్ల రాజమౌళి, అనిల్, జంపయ్య పాల్గొన్నారు.
కరీంనగర్: పెరుక సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెరుక కుల కుటుంబ సమగ్ర డిజిటల్ సర్వే కార్యక్రమాన్ని రాష్ట్ర సంఘం అధ్యక్షుడు గటిక విజయ్‌కుమార్ కరీంనగర్‌లో ప్రారంభించారు. జిల్లా సంఘం సర్వసభ్య సమావేశం బుధవారం స్థానిక ఇంపీరియల్ కన్వెన్షన్‌లో జరిగింది. జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గాండ్ల చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శిగా బస్వ వెంకన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దొంగరి మనోహర్, సుంకరి ఆనంద్, కీత విజయ్‌కుమార్, చుంచు ఉషన్న, దొరిశెట్టి వెంకటయ్య, కందుల సంధ్యారాణి, బరుపాటి సంపత్, అల్లం రాజేశ్‌వర్మ, పోకల నాగయ్య, రేణ మల్లయ్య, వనపర్తి మల్లయ్య, సాయిని దేవన్న, పెట్టాం సంపత్, దాసరి అశోక్, మీసా శ్రీనివాస్, తమ్మిశెట్టి రవి, వంగల మధు, కరుకూరి మల్లేశ్ పాల్గొన్నారు.


