గుండెపోటుతో అభ్యర్థి మృతి
మానకొండూర్: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్ల పంచాయతీ ఎనిమిదో వార్డు సభ్యుడిగా పోటీలో నిలిచిన ముత్యాల చంద్రారెడ్డి(46) బుధవారం గుండెపోటుతో మృతిచెందారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. చంద్రారెడ్డికి వార్డు సభ్యుడిగా పోటీచేసే అవకాశం రావడంతో గ్రామంలోని 8వ వార్డు నుంచి నామినేషన్ దాఖలు చేశారు. అప్పటినుంచి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. నిలిచారు. బుదవారం ఉదయం కూడా ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా గుండెపోటుకు గురై చనిపోయారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
పిచ్చి కుక్క దాడిలో ఐదుగురికి గాయాలు
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ అన్నపూర్ణకాలనీలో బుధవారం పిచ్చి కుక్క స్వైరవిహారం చేసింది. ఈదునూరి బానేశ్, భాగ్య, దుర్గమ్మ, రుద్ర, నర్మదపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. మధ్యాహ్నం ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారి రుద్ర, మరో నలుగురిని కొరికింది. ఇందులో ముగ్గురు మహిళలు, ఓ పురుషుడు ఉన్నారు. గాయపడినవారు వెంటనే ఆస్పత్రికి వెళ్లగా సిబ్బంది వైద్యం అందిస్తున్నారు. పిచ్చి కుక్కల బారినుంచి తమను రక్షించాలని కాలనీవాసులతోపాటు సీపీఎం నాయకులు రామాచారి, భిక్షపతి, గీట్ల లక్ష్మారెడ్డి, మల్లేశ్, నాగలక్ష్మి డిమాండ్ చేశారు.
గుండెపోటుతో అభ్యర్థి మృతి


