ఆర్టీసీకి ‘లక్ష్మీ’ కటాక్షం
కరీంనగర్‌టౌన్: సరిగా రెండేళ్ల క్రితం డిసెంబర్ 9న తెలంగాణలో మహాలక్ష్మీ పథకం ఆరంభమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాల్లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సదుపాయం సక్సెస్ కావడం విశేషం. పథకంలో భాగంగా పల్లె నుంచి పట్నం వరకు మహిళలు నిత్యం వేల సంఖ్యలో రాకపోకలు సాగిస్తుండడం విశేషం. తెలంగాణలో ఆర్టీసీ ఆర్థికానికి వెన్నుదన్నుగా నిలిచిన కరీంనగర్ రీజియన్ పరిధిలో మహిళలు ఉత్సాహంగా రాకపోకలు సాగించారు. రెండేళ్లలో సుమారు 22 కోట్ల మంది మహిళలు మహాలక్ష్మీ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
రోజూ 3,00,822 లక్షల మంది..
కరీంనగర్ రీజీయన్ పరిధిలో మొత్తం 11 డిపోలున్నాయి. మహాలక్ష్మీ పథకం ద్వారా ఇప్పటి వరకు 21.96 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారు. రోజూ సగటున 3,00,822 మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. కరీంనగర్ రీజియన్‌లో రెండేళ్లలో రూ.895.83 కోట్ల ఆదా చేసుకున్నారు. అత్యధికంగా గోదావరిఖని డిపో పరిధిలో రూ.3.35 కోట్లు, అత్యల్పంగా మంథనిలో 1.60 కోట్ల మంది మహిళలు ప్రయాణించారు.
మహాలక్ష్మీ పథకంలో రెండేళ్లలో 21.96 కోట్ల మంది మహిళల ప్రయాణం
కరీంనగర్ రీజియన్‌కు రూ.895.83 కోట్ల ఆదాయం
కరీంనగర్ రీజియన్ పరిధిలో రెండేళ్ల మహాలక్ష్మీ ఆదాయం
డిపో మహాలక్ష్మీ రూ. కోట్లలో
ప్రయాణికులు
(కోట్లలో)
గోదావరిఖని 3.35 130.37
హుస్నాబాద్ 1.53 53.50
హుజూరాబాద్ 1.69 70.14
జగిత్యాల 2.89 112.53
కరీంనగర్–1 2.15 76.31
కరీంనగర్–2 2.13 112.73
కోరుట్ల 1.89 70.52
మంథని 1.06 57.87
మెట్‌పల్లి 1.78 72.26
సిరిసిల్ల 1.66 71.15
వేములవాడ 1.82 68.45
మొత్తం 21.96 895.83


