పంచాయతీ బరిలోఇంజినీర్లు
కోనరావుపేట(వేములవాడ): మండలంలోని భుక్యారెడ్డితండాకు చెందిన బానోత్ నరేశ్‌కుమార్ బీటెక్ సివిల్ ఇంజినీర్ చదివి అగ్రహారంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఫ్యాకల్టీగా పనిచేశారు. నరేశ్ తండ్రి జయరాం రేషన్‌డీలర్, తల్లి శోభ గృహిణి. కొంతకాలంగా సామాజిక సమస్యలపై పోరాడుతున్న నరేశ్ సమాజంలో మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో సర్పంచ్‌గా బరిలో నిలిచాడు.
కంప్యూటర్..
జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ సర్పంచ్ జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో ఇద్దరు అభ్యర్థులు పోటీ పడుతుండగా.. ఒకరు నల్ల కవిత కంప్యూటర్ ఇంజినీరింగ్ చదివారు. ఆమె భర్త స్వామిరెడ్డి జగిత్యాల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. – నల్ల కవిత
సాఫ్ట్‌వేర్..
సుల్తానాబాద్‌రూరల్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్లకు చెందిన కాంపెల్లి సతీశ్‌కుమార్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలి సర్పంచ్ బరిలో నిలిచాడు. నెలకు రూ.1.70 లక్షల వేతనం వచ్చే ఉద్యోగాన్ని వదిలి నీరుకుల్ల సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఒకసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను వేడుకుంటున్నారు. – కాంపెల్లి సతీశ్‌కుమార్
ఉద్యోగం వదిలి..
కాల్వశ్రీరాంపూర్: మండలంలోని పెగడపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఇంజినీరింగ్ చదివిన ఆరెల్లి ప్రవీణ్‌కుమార్‌గౌడ్ పోటీ చేస్తున్నాడు. గ్రామ సమస్యల పరిష్కారానికి ఇతరులపై ఆధారపడకుండా తానే ముందుంటానని చెబుతూ ప్రచారం చేస్తున్నాడు. హైదరాబాద్‌లో మేనేజర్ స్థాయి ప్రైవేట్ ఉద్యోగాన్ని ఉద్యోగం వదిలి గ్రామ సర్పంచ్‌గా పోటీ చేస్తున్నాడు.
తల్లిదండ్రుల ఆశయాలు.. తమ స్వప్నాలను సాధించేందుకు ఉన్నతవిద్యనభ్యసించారు. ఇంజినీరింగ్ చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించారు. సివిల్, కంప్యూటర్ ఇంజినీర్లుగా సమాజం నిర్మాణానికి దోహదపడ్డారు. సొంత గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామంటూ పంచాయతీ ఎన్నికల్లో బరిలో నిలిచారు. తమ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామంటూ పల్లెపోరులో నిలబడ్డారు. ఇంజినీరింగ్ సర్పంచ్ అభ్యర్థులపై ప్రత్యేక కథనం..
సివిల్ ఇంజినీర్..
పంచాయతీ బరిలోఇంజినీర్లు
పంచాయతీ బరిలోఇంజినీర్లు
పంచాయతీ బరిలోఇంజినీర్లు
పంచాయతీ బరిలోఇంజినీర్లు


