స్తంభంపల్లిలో చిరుత కలకలం
వెల్గటూర్: వెల్గటూర్ మండలం స్తంభంపల్లిలో చిరుతపులి సంచరించిందనే వార్త కలకలం సృష్టించింది. ఆదివారం రాత్రి సమయంలో వెల్గటూర్ నుంచి మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటకు వెళ్తున్న రంజిత్ కుమార్‌కు రాయపట్నం శివారు పెట్రోల్ బంక్ సమీపంలో చిరుతపులి కనిపించిందని గ్రామస్తులకు తెలిపాడు. దీంతో గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారులు సోమవారం చిరుత సంచరించినట్లు చెబుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ ఆధారాలు కనిపించలేదు. గ్రామస్తులను అప్రమత్తం చేయాలని స్తంభంపల్లి, రాయపట్నం పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. పశువులకాపర్లు అటువైపు వెళ్లొద్దని, మరోసారి చిరుతను గుర్తిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వంగ శ్రీనాథ్, సెక్షన్ ఆఫీసర్ అమీర్ సయ్యద్ అలీ, బీట్ ఆఫీసర్ నవీన్, గ్రామస్తులు పాల్గొన్నారు.
నిజాయితీ చాటుకున్న 102 సిబ్బంది
ధర్మపురి: ప్రసవం కోసం 102లో వెళ్లిన ఓ మహిళ మర్చిపోయిన బ్యాగ్‌తోపాటు డబ్బులను తిరిగి అ ప్పగించి నిజాయితీ చాటుకున్నారు సిబ్బంది. బు గ్గారం మండల కేంద్రానికి చెందిన సుకన్య డెలివరీ కోసం 102లో ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. ఆమె వెంట తెచ్చుకున్న బ్యాగ్‌ను వాహనంలోనే మర్చిపోయింది. సిబ్బంది చూడగా వారికి బ్యాగ్ కనిపించడంతో అందులో ఉన్న సెల్‌నంబర్‌కు ఫోన్ చేశారు. బ్యాగ్‌తోపాటు రూ.పదివేలను బాధితరాలు కుటుంబానికి అప్పగించారు. నిజాయితీ చాటుకున్న ఫైలెట్ పంజా సురేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
స్తంభంపల్లిలో చిరుత కలకలం


