జాతీయ స్థాయి రెస్క్యూ పోటీల్లో సింగరేణి సత్తా
గోదావరిఖని: జాతీయస్థాయి రెస్క్యూ పోటీల్లో సింగరేణి సత్తా చాటిందింది. ఈనెల 2 నుంచి 7వరకు మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని మ్యాంగనీస్ ఓవరీస్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలు ఆదివారం ముగిశాయి. దేశవ్యాప్తంగా 29 పురుషుల, ఏడు మహిళా జట్లు పాల్గొన్నాయి. హోరాహోరీగా జరిగిన ఈ పోటీల్లో సింగరేణి సంస్థ బీటీం జట్టు ప్రతిభ కనబర్చి బొగ్గు గనుల విభాగంలో ఓవరాల్ చాంపియన్ సాధించింది. రెండో స్థానంలో డబ్ల్యూసీఎల్ ఏటీం, మూడో స్థానంలో డబ్ల్యూసీఎల్ బీటీం నిలిచింది. సింగరేణి ఏటీం జటు నాలుగో స్థానాన్ని కై వసం చేసుకుంది. ఐదో స్థానంలో ఈసీఎల్ ఏటీం, ఆరో స్థానంలో ఎంసీఎల్ బీ టీం జట్లు నిలిచాయి.
సత్తా చాటిన సింగరేణి మహిళా రెస్క్యూ టీం
మొదటి సారిగా జాతీయస్థాయి రెస్క్యూ పోటీల్లో పాల్గొన్న సింగరేణి మహిళా జట్లు ఓవరాల్ రెండో స్థానాన్ని కై వసం చేసుకుంది. మహిళా విభాగంలో ఏడు జట్లు పాల్గొనగా, పోటీలు నిర్వహించిన ఎంఓఐఎల్ జట్లు మొదటి స్థానం సాధించగా, రెండో స్థానంలో సింగరేణి జట్టు నిలిచింది.
వ్యక్తిగత విభాగంలో సైతం..
జాతీయ స్థాయి రెస్క్యూ పోటీల్లో సింగరేణి జట్టు వ్యక్తిగత విభాగాల్లో కూడా అనేక బహుమతులు సాధించింది. రెస్క్యూ అండ్ రికవరీ విభాగంలో సింగరేణి బీటీం మొదటి స్థానం, రోప్ రెస్క్యూలో మూడో స్థానం సాధించాయి.
మహిళా రెస్క్యూ మహిళా జట్టు సత్తా..
మహిళా విభాగం బెస్ట్ రెస్క్యూలో తాళ్ల గాయిత్రి మొదటి స్థానం, మౌనిక రెండో స్థానం, క్యాప్టెన్ ఆవార్డులో సింగరేణి జట్టు క్యాప్టెన్ క్రిష్ణవేణి మొదటి స్థానం పొందింది. థియరీలో మొదటి స్థానం, మహిళా ఫస్ట్ ఎయిడ్‌లో మొదటి, రెండు స్థానాలు సాధించారు.
పురుషుల విభాగంలో..
బెస్ట్ మెంబర్‌గా సింగరేణి టీంకు చెందిన మధుసూదన్, బెస్ట్‌క్యాప్టెన్‌గా సింగరేణి బీటీంకు చెందిన ప్రమోద్ ఎంపికయ్యారు. థియరీలో సింగరేణి బీటీం మూడో స్థానం, స్టాట్యుటరీలో సింగరేణి బీటీం రెండో స్థానం, ఫస్ట్ ఎయిడ్‌లో సింగరేణి ఏటీం మొదటి, బీటీం రెండో స్థానం సాధించాయి. రెస్క్యూ రికవరీలో సింగరేణి బీటీం మొదటిస్థానం సాధించింది.
ఓవరాల్ మొదటిస్థానం సాధించిన సింగరేణి బీటీం
మహిళా విభాగంలో ఓవరాల్ రెండో స్థానం
పలు విభాగాల్లో బహుమతులు
జాతీయ స్థాయి రెస్క్యూ పోటీల్లో సింగరేణి సత్తా


