రాంపల్లి సర్పంచ్..
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం రాంపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్‌గా కనపర్తి సంపత్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంపత్‌రావు, కోదాటి దేవేందర్‌రావులు నామినేషన్ వేయగా, గ్రామపెద్దలంతా ఆదివారం సమావేశమై సంపత్‌రావుకు సర్పంచ్ పదవి కట్టబెట్టేలా దేవేందర్‌రావుకు నచ్చజెప్పి పోటీ నుంచి ఉపసంహరింపజేశారు. అలాగే 8వార్డు సభ్యుల పదవుల్లో 4వార్డులకు ఒక్క నామినేషన్ చొప్పున దాఖలయ్యాయి. మిగతా 4వార్డులు సైతం ఏకగ్రీవంగా చేసి పంచాయతీ పాలకవర్గాన్ని ఏకగ్రీవం చేయాలనే ఆలోచనలో గ్రామపెద్దలున్నట్లు తెలుస్తోంది.


