రాగట్లపల్లి సర్పంచ్ ఏకగ్రీవం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి సర్పంచ్, వార్డుసభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నెత్తెట్ల లస్మయ్యను సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. ఆరువార్డులకు వార్డుసభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచ్‌తోపాటు ఆరు వార్డులకు ఒక్కో నామినేషన్‌లు దాఖలు కావడంతో ఏకగ్రీవమయ్యాయి. గుంటపల్లిచెరువుతండా గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా భూక్య తిరుపతినాయక్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవమైంది. మండలంలో రెండు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి ఎన్నికై న వారికి శుభాకాంక్షలు తెలిపి శాలువ కప్పి సన్మానించారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
గండిలచ్చపేట..
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని గండిలచ్చపేట గ్రామపంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ందిది. మొదట ముగ్గురు అభ్యర్థులు సర్పంచ్ బరిలో ఉండగా ఇద్దరు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో సర్పంచ్‌గా జంగిటి అంజయ్య ఏకగ్రీవమయ్యారు. వార్డు సభ్యులు ఇప్పటికే ఏకగ్రీవం కాగా ఆదివారం ఉపసర్పంచ్‌గా పుట్ట భాను ఎన్నికయ్యారు. నూతన పాలకవర్గాన్ని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్‌ఎస్ నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, వలకొండ వేణుగోపాల్‌రావు, మాట్ల మధు, పడిగెల రాజు తదితరులు పాల్గొన్నారు.
రాగట్లపల్లి సర్పంచ్ ఏకగ్రీవం


