ఎన్టీపీసీ నేఫి వైస్ చైర్మన్‌గా నితీశ్‌కుమార్
జ్యోతినగర్: ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ ఫెఢరేషన్ ఆఫ్ ఇండియాకు జరిగిన ఎన్నికల్లో ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టుకు చెందిన నితీశ్‌కుమార్ నెఫి వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆదివారం ఢిల్లీ సమీపంలోని ఎన్టీపీసీ దాద్రి ప్రాజెక్టులో జరిగిన ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ ఫెఢరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల్లో దేశవ్యాప్తంగా గల ఎన్టీపీసీ ప్రాజెక్టుల ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. వైస్ చైర్మన్‌గా రామగుండం ప్రాజెక్టుకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ నితీశ్‌కుమార్ ఎన్నికయ్యారు.
ముక్కిన బియ్యం తిని 30 గొర్రెలు మృతి
మల్యాల: మల్యాల మండలం రామన్నపేటలో ముక్కిన బియ్యం తిని 30 గొర్రెలు మృతి చెందాయి. మరో 20 గొర్రెలు అస్వస్థతకు గురయ్యాయి. గ్రామానికి చెందిన తాడుక గంగన్న, దండిక మల్లేశం తమ గొర్రెల మందను మేత కోసం గ్రామ శివారులోకి తీసుకెళ్లారు. పొలంలో పారబోసిన ముక్కిన బియ్యం తిని అస్వస్థతకు గురయ్యాయి. రెండు రోజుల వ్యవధిలో 30 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెలను బతికించుకునేందుకు రూ.50వేలకుపైగా మందులు కొనుగోలు చేసి, చికిత్స చేసినా ఫలితం లేకుండాపోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ముక్కిన బియ్యం తినడంతోనే జీవాలు మృతి చెందాయని మండల పశు వైద్యాధికారి రాజ్‌కుమార్ తెలిపారు.
బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. ముక్కిన బియ్యం తిని మూగజీవాలు మృతిచెందాయని, వాటి విలువ సుమారు రూ.8లక్షల వరకు ఉంటుందని బాధితులు వివరించారు. ఎమ్మెల్యే వెంట వెల్మ లక్ష్మారెడ్డి, నేరెళ్ల సతీశ్‌రెడ్డి, వెల్మ కృష్ణారెడ్డి ఉన్నారు.
కట్నం వేధింపులకు వివాహిత బలి
కోరుట్ల: పట్టణంలోని అల్లమయ్యగుట్ట ప్రాంతానికి చెందిన ఆడెపు రచన (జోగ లహరి)వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన జోగ రాజేశ్‌తో పట్టణానికి చెందిన రచనకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. అదనంగా మరో రూ.3లక్షలు కట్నంగా కావాలని రాజేశ్ నిత్యం వేధిస్తున్నాడు. అత్తామామలు దేవక్క, దుబ్బయ్య, ఆడబిడ్డ వాసం రాజు కలిసి ఇంట్లోనుంచి గెంటేశారు. దీంతో తల్లిగారింటికి వచ్చిన రచన జీవితంపై విరక్తితో వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. రచన తండ్రి రవి ఫిర్యాదు మేరకు ఆమె భర్త, అత్తామామ, ఆడబిడ్డపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటకు చెందిన నమిలికొండ సత్తయ్య చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. ఎస్సై రాహుల్‌రెడ్డి కథనం ప్రకారం.. ఈనెల 3న సత్తయ్య ఇంటికి నడుచుకుంటూ వస్తుండగా ఎస్సీకాలనీ వద్ద గుంటపల్లిచెరువుతండాకు చెందిన గుగులోతు విజయ్ బైక్‌తో ఢీకొట్టాడు. గాయపడ్డ సత్తయ్యను ఆటోలో ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుమారుడు బాబు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఎన్టీపీసీ నేఫి వైస్ చైర్మన్‌గా నితీశ్‌కుమార్


