14న కేపీఎస్ టాలెంట్ ఎంకరేజ్‌మెంట్ ఎగ్జామ్
కరీంనగర్ టౌన్: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు కోట పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో కోట టాలెంట్ ఎంకరేజ్‌మెంట్ ఎగ్జామ్–2026 ఈనెల 14న నిర్వహించనున్నట్లు స్కూల్ చైర్మన్ డి.అంజిరెడ్డి తెలిపారు. ఆదివారం పరీక్షకు సంబంధించిన పోస్టర్లను స్కూల్‌లో ఆవిష్కరించారు. 3వతరగతి నుంచి 9వతరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షలో పాల్గొనొచ్చని, ప్రస్తుత తరగతి సిలబస్ ఆధారంగా పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 100 శాతం స్కాలర్‌షిప్‌తోపాటు ఉచిత విద్య అందించనున్నట్టు పేర్కొన్నారు. ఐఐటీ–జేఈఈ, నీట్, ఒలింపియాడ్ వంటి జాతీయస్థాయి పరీక్షలకు ఆరోతరగతి నుంచే ప్రత్యక్ష శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
మద్యం పట్టివేత
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లిలో అక్రమంగా మద్యం విక్రయిస్తుండగా ఆదివారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై రాహుల్‌రెడ్డి తెలిపిన వివరాలు. రాచర్లగొల్లపల్లికి చెందిన షేక్ మౌలానా అనే వ్యక్తి తన హోటల్లో అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తున్నట్లు అందిన సమాచారంతో పోలీసులు దాడి చేశారు. హోటల్‌లో తనిఖీలు నిర్వహించగా మద్యం బాటిళ్లు దొరకడంతో స్వాఽ దీనం చేసుకొని మౌలానాపై కేసు నమోదు చేశారు. గ్రామాల్లో ఎవరైనా అక్రమంగా మ ద్యం విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.


