మెడికల్ కాలేజీకి పార్థివదేహం దానం
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖనిలోని సిమ్స్ మెడికల్ కాలేజీకి శనివారం రాత్రి మంచిర్యాల జిల్లా మామిడిగట్టు గ్రామానికి చెందిన వృద్ధుడు మందల రాజిరెడ్డి (82) పార్థీవ దేహాన్ని కుటుంబసభ్యులు, సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు దానం చేసి ఆదర్శంగా నిలిచారు. శనివారం అనారోగ్యంతో రాజిరెడ్డి మరణించగా, సదాశయ ఫౌండేషన్ ప్రచార కార్యదర్శి వాసు, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి ఆధ్వర్యంలో ఆయన నేత్రాలను ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్‌కు దానం చేశారు. అనంతరం పార్థీవ దేహాన్ని సిమ్స్ మెడికల్ కాలేజీకి దానం చేసి స్పూర్తిగా నిలిచారు. ఐదు నెలల క్రితం మరణించిన తల్లి పార్థీవ దేహాన్ని కూడా మంచిర్యాల మెడికల్ కాలేజీకి దానం చేసిన కొడుకు శ్యాంసుందర్ రెడ్డి నేడు తండ్రి పార్థీవ దేహాన్ని మెడికల్ కాలేజీకి దానం చేసి ఆదర్శంగా నిలిచారని సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, కార్యదర్శి డాక్టర్ మేరుగు భీష్మాచారి, ప్రచార కార్యదర్శి కేఎస్ వాసు, మారెల్లి రాజిరెడ్డి, లగిశెట్టి చంద్రమౌళి, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ నరేందర్, జీజీహెచ్ సూపరింటెండెంట్ దయాళ్‌సింగ్, ఆర్‌ఎంవో దండే రాజు అభినందించారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపర్‌వైజర్ కూడిదల శివ, సిబ్బంది బొజ్జ శ్రీనివాస్, అన్నం చంద్రశేఖర్, గడ్ర సాయికృష్ణ, మంచినీళ్ల శివకుమార్, రేఖల రాజేంద్రప్రసాద్ పాల్గొని మందల రాజిరెడ్డికి నివాళి అర్పించారు.
నేత్రదానం చేసి.. ఇద్దరికి చూపునిచ్చి
మెడికల్ కాలేజీకి పార్థివదేహం దానం


