పటిష్ట భద్రతకు ప్రత్యేక ప్రణాళిక
కరీంనగర్‌క్రైం: గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రణాళికబద్ధంగా చర్యలు చేపడుతున్నామని సీపీ గౌస్‌ఆలం తెలిపారు. కమిషనరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం కరీంనగర్‌రూరల్, హుజూ రాబాద్ డివిజన్లలోని ఉన్నతాధికారులు, క్లస్టర్ ఇన్‌చార్జీలు, రూట్ ఇన్‌చార్జులు, గ్రామ పోలీసు అధికా రులందరితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల బందోబస్తు ప్రణాళిక అమలుపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సందర్భంగా అధికారులు చేయాల్సిన, చేయకూడని పనుల గురించి చిన్న హ్యాండ్‌బుక్‌లెట్ అందిస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ రూరల్, హుజూరాబాద్ డివిజన్లలోని 15 పోలీ సుస్టేషన్ల పరిధిలో పోలింగ్‌కేంద్రాలకు అనుగుణంగా 104 రూట్లు ఉండగా, 57 క్లస్టర్లు ఉన్నాయని వీటికి 83మంది క్లస్టర్ ఇన్‌చార్జీలు ఉన్నారని తెలిపా రు. 309మంది వీపీవోలను నియమించామన్నారు. ఎన్నికల సందర్భంగా క్షేత్రస్థాయిలో 508 మంది పోలీసులు నిరంతరంగా విధులు నిర్వహిస్తారని తెలిపారు. ఇద్దరు ఏసీపీలు, నలుగురు సీఐలు, 25మంది ఎస్సైలు వీరిని పర్యవేక్షిస్తారని అన్నారు.


