పౌర్ణమి రోజు అర్ధరాత్రి వరకు..
వీణవంక: మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్ని కల నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. గురువా రం పౌర్ణమి, మంచిరోజు అని భావించి చాలామంది నామినేషన్ వేశారు. వీణవంక మండలం వల్భాపూర్‌లో అర్ధరాత్రి వరకు అభ్యర్థులు బారులు తీరా రు. వల్బాపూర్ పరిధిలో బేతిగల్, కనపర్తి, వల్బా పూర్, నర్సింగాపూర్ గ్రామాలున్నాయి. గురువారం మంచి రోజు అని సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల కు సాయంత్రం 4గంటలకు ఒక్కసారిగా నామినేషన్ పత్రాలతో పోటెత్తారు. సాయంత్రం 5గంటలకు అధికారులు స్వీకరణ ముగించినప్పటికే, క్యూలైన్‌లో అభ్యర్థులు భారీగా నిల్చుకున్నారు. నామినేషన్ల స్వీకరణ అర్ధరాత్రి వరకు సాగింది.


