భవిత కేంద్రాలతో పిల్లల్లో మార్పు
తిమ్మాపూర్: భవిత కేంద్రాలు దివ్యాంగ పిల్లలకు అండగా నిలుస్తున్నాయని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మండలంలోని మహాత్మానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మించిన భవిత కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భవిత కేంద్రాల్లో ప్రత్యేక పద్ధతిలో విద్యా బోధన ద్వారా దివ్యాంగ విద్యార్థుల్లో ఎంతో మార్పు కనిపిస్తోందని తెలిపా రు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ దివ్యాంగుల కోసం జిల్లాలో అనేక కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. డీఈవో మొండయ్య, తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవో రాజీవ్ మల్హోత్రా, విద్యాశాఖ కోఆర్డినేటర్ శ్రీనివాస్ ఎంఈవో శ్రీనివాస్, డీఈ కృష్ణ కుమార్, హెచ్‌ఎం శ్రీనివాస్ పాల్గొన్నారు.
బుధవారం బోధన పరిశీలన
మహాత్మానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం బోధన కార్యక్రమాన్ని కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. విద్యార్థులతో పాఠాలు చదివించారు. కొందరు సరిగ్గా చదవకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 10వ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్నందున ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.


