పంచాయతీలు ఏకగ్రీవం
మంథనిరూరల్: పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని 35 గ్రామపంచాయతీల్లో మూడు పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు దక్కించుకున్నారు. మైదుపల్లిలో ఇద్దరు నామినేషన్లు వేయగా.. ఒకరు తప్పుకోగా.. పంతంగి లక్ష్మణ్ ఏకగ్రీవమయ్యారు. తోటగోపయ్యపల్లిలో ఇద్దరు నామినేషన్లు వేయగా.. ఒకరు ఉపసంహరించుకున్నారు. దొబ్బల రమేశ్ ఒక్కరే మిగిలారు. నాగారంలో ముగ్గురు నామినేషన్లు వేయగా.. ఇద్దరు ఉపసంహరించుకున్నారు. బెల్లంకొండ శ్రీదేవి ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. తోటగోపయ్యపల్లిలో ఆరుగురు, నాగారంలో ముగ్గురు వార్డు సభ్యులు ఏకగ్రీవం అయ్యారు. సర్పంచ్ స్థానాలు ఏకగ్రీమైన మైదుపల్లి, నాగారంలో ఈనెల 11న వార్డు స్థానాలకే ఎన్నికలు జరుగనున్నాయి. మైదుపల్లిలో ఆరు, నాగారంలో ఐదు వార్డు స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు.
రమేశ్
(తోటగోపయ్యపల్లి)
శ్రీదేవి
(నాగారం)
లక్ష్మణ్
(మైదుపల్లి)
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరిగే పలు గ్రామాల్లో గ్రామస్తులు ముందుకొచ్చి పంచాయతీ పాలకవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచ్ అభ్యర్థుల ఇచ్చిన హామీలు నచ్చి కొందరు గ్రామస్తులు ఏకగ్రీవానికి ఒప్పుకోగా.. అభ్యర్థుల గుణగణాలు నచ్చి మరికొందరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.


