మూడు జీపీలు ఒకే బాటలో..
కథలాపూర్/మెట్‌పల్లిరూరల్/ఇబ్రహీంపట్నం: కథలాపూర్ మండలం రాజారాంతండా సర్పంచ్, వార్డుస్థానాలు ఏకగ్రీవమైనట్లు రిటర్నింగ్ అధికారి శ్రీరాం కిషన్ తెలిపారు. సర్పంచ్ స్థానంతోపాటు నాలుగు వార్డులకు ఒక్కొక్కరు చొప్పున నామినేషన్ దాఖలు చేయడంతో సర్పంచ్‌గా భూక్య తిరుపతినాయక్, ఒకటో వార్డుకు లకావత్ పద్మ, రెండో వార్డుకు లకావత్ జ్యోతి, మూడో వార్డుకు లకావత్ రాజేందర్, నాలుగో వార్డుకు భూక్య లక్ష్మి ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. మెట్‌పల్లి మండలం చింతలపేట సర్పంచ్‌గా తోట్ల చిన్నయ్య ఏకగ్రీవమయ్యారు. సర్పంచ్ స్థానానికి ఐదుగురు నామినేషన్లు దాఖలు చేయగా బుధవారం నలుగురు విత్‌డ్రా చేసుకున్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని మూలరాంపూర్ సర్పంచుగా కానుగంటి లాస్యప్రియ ఒకరే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవమయ్యారు. యామపూర్‌కు కనక నాగేష్, ఎలాల గోపాల్‌రెడ్డి నామినేషన్ వేశారు. గోపాల్‌రెడ్డి విత్‌డ్రా చేసుకోవడంతో నాగేష్ ఏకగ్రీవమయ్యారు.
మూడు జీపీలు ఒకే బాటలో..


