ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
కరీంనగర్‌క్రైం/చిగురుమామిడి/సైదాపూర్:జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించడానికి పటిష్ట భద్రత చర్యలు చేపడుతున్నామని సీపీ గౌస్ ఆలం పేర్కొన్నారు. రెండో విడ త నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను మంగళవారం పర్యవేక్షించా రు. తిమ్మాపూర్ మండలం నుస్తుల్లాపూర్, నల్లగొండ, పర్లపల్లి, మొగిలిపాలెం, చిగురుమామిడి మండలం రేకొండ, సుందరగిరి, బొమ్మనపల్లి, సైదాపూర్, సోమారం, శంకరపట్నం, తాడికల్ గ్రామాల్లో పర్యటించారు. పోలింగ్ రోజు అదనపు పోలీసు బలగాలను మోహరించి, పటిష్ట బందోబస్తు ఏర్పా టు చేయనున్నట్లు స్పష్టం చేశారు. రూరల్ ఏసీపీ విజయకుమార్, హుజూరాబాద్ ఏసీపీ మాధవి, సీఐలు సదన్ కుమార్, వెంకట్, ఎస్సైలు శ్రీకాంత్, తిరుపతి, సాయికృష్ణ పాల్గొన్నారు.
ఎన్నికల బందోబస్తుపై సీపీ సమీక్ష
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేయాలని సీపీ గౌస్ ఆలం అధికారులను ఆదేశించారు. సీపీ కార్యాలయంలో మంగళవారం మాట్లాడుతూ ఓటర్లు నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకునేలా భద్రత కల్పించాలన్నారు. డీజేలు, బహిరంగ మద్యపానం, డ్రోన్ల వినియోగంపై ఈ నెల 31వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయన్నారు.
సైబర్ నేరాలపై సమరశంఖం
సైబర్ నేరాలపై అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని సీపీ గౌస్‌ఆలం అన్నారు. సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌లో ‘ఫ్రాడ్ కా ఫుల్‌స్టాప్– సైబర్ క్లబ్’ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి, పోస్టర్ ఆవిష్కరించారు. కళాశాలల విద్యార్థులు సైబర్ సేఫ్టీ అంబాసిడర్లుగా ఎదగాలని ప్రతిజ్ఞ చేయించారు.


