రాజీవ్ రహదారి.. రైల్వేలైనే హద్దులు
నామినేషన్ విత్ డ్రా చేయాలని వ్యక్తిపై దాడి
రామగుండం: అంతర్గాం మండలం కుందనపల్లి పంచాయతీకి చెదరని హద్దులు ఉన్నాయి. దీనికి అనుబంధ బద్రిపల్లికీ ఓ వైపు రైల్వేలైన్, మరోవైపు రాజీవ్ రహదారి హద్దులుగా ఉన్నాయి. ఇందిరమ్మ(ఐఓసీ) కాలనీ–మొగల్‌పహాడ్ గ్రామాల మధ్య రాజీవ్ రహదారి ఉంటుంది. వీటితర్వాత ప్రధాన రైల్వేలైన్ పక్కనే కుందనపల్లి గ్రామం ఉంది. దీనికి మరోవైపు ఎన్టీపీసీ నుంచి అక్బర్‌నగర్ సమీపంలోని యాష్‌పాండ్ వరకు బూడిద పైపులైన్ సరిహద్దు ఉంటుంది. బద్రిపల్లి, మొగల్‌పహాడ్, ఇందిరమ్మ(ఐఓసీ) కాలనీల సమూహమే కుందనపల్లి పంచాయతీ. ప్రస్తుతం ఎన్నికల నేపధ్యంలో అభ్యర్థులు వీటన్నింటినీ దాటుకొని వెళ్తేనే ప్రచారం చేసేది.
రైల్వేలైన్ చెంతనే కుందనపల్లి
ఓట్లు సమానంగా వస్తే..
కరీంనగర్ అర్బన్: ఎన్నికల్లో గెలుపు కోసం ఒక్కో అభ్యర్థి పడే కసరత్తు అంతాఇంతా కాదు. విజయమే లక్ష్యంగా ఓటు వేటలో వేయని ఎత్తులు ఉండవు. మరీ ఇంత చేసినా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఇద్దరికి సమానంగా ఓట్లు వస్తే..? ఈ సందర్భం వస్తే లాటరీ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. లాటరీ ఏ అభ్యర్థికి అనుకూలంగా వస్తుందో ఆ అభ్యర్థికి ఒక అదనపు ఓటు వచ్చినట్లుగా భావించి విజేతగా ప్రకటిస్తారు. సమాన ఓట్లు పొందిన అభ్యర్థుల పేర్లను సమాన రంగు, పరిమాణం కలిగిన ఐదేసి చీటీలపై రాసి వాటిని గుర్తించకుండా కలుపుతారు. తదుపరి ఒక చీటీని డ్రా తీయగా దాంట్లో ఎవరి పేరైతే వస్తుందో ఆ అభ్యర్థి గెలుపొందినట్లు ప్రకటిస్తారు.
విలేజ్ వాయిస్
తంగళ్లపల్లి(సిరిసిల్ల): నామినేషన్ విత్‌డ్రా చేసుకోవాలని వార్డు మెంబర్ అభ్యర్థిపై దాడిచేసిన పలువురు వ్యక్తులపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై ఉపేంద్రచారి తెలిపిన వివరాలు.. మండలంలోని అంకిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన సుంకపాక శరత్ గ్రామంలో 1వ వార్డు అభ్యర్థిగా నామినేషన్ వేశాడు. కాగా నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని శరత్‌ను గ్రామానికి చెందిన దేవచంద్రం, సాయి, కంకర రాజు, కంకర కిషన్ బెదిరింపులకు గురిచేసి దాడి చేశారు. బాధితుడి పెద్దనాన్న సుంకపాక దేవయ్య ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
రాజీవ్ రహదారి.. రైల్వేలైనే హద్దులు


