ఆ పల్లెలు ఏకగ్రీవం..
● వీరాపూర్ సర్పంచ్‌గా దిండగుల గంగు
రాయికల్: రాయికల్ మండలం వీరాపూ ర్ సర్పంచ్‌తో పాటు, వార్డులన్నిటికీ ఒక్కటి చొప్పున నామినేషన్ రావడంతో అన్ని స్థానాలూ ఏకగ్రీవమయ్యాయి. సర్పంచ్‌గా దిండగుల గంగు ఎన్నికయ్యారు. వార్డు సభ్యులుగా దొమ్మంటి లావణ్య, మహ్మద్ అమీర్‌బీ, తొట్ల రాజిరెడ్డి, చెట్లపల్లి అంజన్న, ముక్కెర నరేశ్, దుంపల నర్సారెడ్డి, నీలి మమత, సుందరగిరి మురళీ ఏకగ్రీవమయ్యారు.
చెర్లపల్లి పంచాయతీకి ఒకే నామినేషన్
జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం చెర్లపల్లి పంచాయతీ జనరల్ మహిళకు రిజర్వేషన్ అయింది. సర్పంచ్ స్థానానికి మేడిపల్లి వనిత ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ఒకటో వార్డుకు ఇమ్మడి విజయ్, రెండో వార్డుకు బాలు సాని విజయ, మూడోవార్డుకు బాలుసాని స్వరూ ప, నాలుగో వార్డుకు కోల రాజిరెడ్డి, ఐదో వార్డుకు దుమల సుమన్, ఆరో వార్డుకు బొమ్మెన రాజేందర్ ఒక్కటి చొప్పున నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన అనంతరం అధికారులు వారిని ఏకగ్రీవం అయినట్లు ప్రకటించనున్నారు.
నాయికపుగూడెంలో..
సారంగాపూర్: మండలంలోని నాయికపుగూడెం సర్పంచ్‌కు ఒకటే నామినేషన్ రావడంతో ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. కొత్తూరి పుష్పనాథ్ ఒక్కడే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవం కానుంది. భీంరెడ్డిగూడెం సర్పంచ్‌గా మైనేని ప్రమీల, వార్డు సభ్యులుగా మారినేని రాజేందర్, గుడిపెల్లి బాలవ్వ, కర్నాటకపు జమున, సిరిపెల్లి భీమయ్య ఏకగ్రీవం కానున్నారు. ఒడ్డెరకాలనీ సర్పంచ్‌గా పల్లపు మాధవి, వార్డుసభ్యులుగా పొగుల ఎల్లారెడ్డి, దండుగుల రమేశ్, చెల్ల లావణ్య, పల్లపు నాంపల్లి, బోదాసు మధువర్ష, పల్లపు పుష్పలత ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది.
ఇల్లంతకుంట(మానకొండూర్): ఇల్లంతకుంట మండలం తిప్పాపురం జనరల్ మహిళకు రిజర్వ్ కాగా, సర్పంచ్‌గా బొల్లవేణి మంజులను ఏకగ్రీవం చేసేందుకు ఒకే నామినేషన్ దాఖలు చేశారు. అలాగే వార్డు సభ్యులకు ఒక్కో నామినేషన్ దాఖలు చేశారు. చిక్కుడువానిపల్లె గ్రామపంచాయతీ ఏకగ్రీమైంది. సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు ఒక్కో నామినేషన్ దాఖలు చేశారు. సర్పంచ్ అభ్యర్థిగా చింతమడక కళ్యాణ్, వార్డు సభ్యులుగా చిక్కుడు సత్యం, చిక్కుడు శ్రీనివాస్, కంకటి బాలవ్వ, చింతమడక రమ్య నామినేషన్ వేశారు.
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): సర్పంచ్ ఎన్నికల్లో ఒకరిపై ఒకరు పోటీకి నిలబడితే కక్షలు పెరిగే అవకాశం ఉందని భావించిన గ్రామస్తులు ఏకగ్రీవం చేయాలని భావించారు. ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో 360 మంది జనాభా ఉంటారు. గ్రామంలో పార్టీల గొడవలు లేకుండా ఏకగ్రీవం చేసేందుకు గ్రామస్తులు ఏకతాటిపైకి వచ్చారు. సర్పంచ్ అభ్యర్థిగా నెత్తెట్ల లస్మయ్య, ఉపసర్పంచ్ అభ్యర్థిగా మందాటి రామును ప్రకటించారు.
ఈ గ్రామాలకు ఒక్కటే నామినేషన్
తంగళ్లపల్లి(సిరిసిల్ల): పంచాయతీ ఎన్నికల్లో పోటీ పడేందుకు పలు గ్రామాల్లో అభ్యర్థులు కుప్పలు తెప్పలుగా నామినేషన్లు వేయగా.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం వేణుగోపాల్‌పూర్, బాలమల్లుపల్లెలో సర్పంచ్ స్థానాలకు ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలయ్యింది. నామినేషన్ పత్రాల స్కూటినీ తర్వాత అన్నిపత్రాలు సక్రమంగా ఉంటే ఒక్క నామినేషన్ వేసిన అభ్యర్థులనే రిటర్నింగ్ అధికారులు ఏకగ్రీవ విజేతలుగా ప్రకటించే అవకాశం ఉంది.
ఆ పల్లెలు ఏకగ్రీవం..
ఆ పల్లెలు ఏకగ్రీవం..
ఆ పల్లెలు ఏకగ్రీవం..


