బరిలో విద్యావంతులు
జూలపల్లి(పెద్దపల్లి): యువతీయువకుల్లో రాజకీయ చైతన్యం వెల్లివిరుస్తోంది. రెండోవిడత సర్పంచ్, వార్డు స్థానాలకు విద్యావంతులు నామినేషన్లు వేశారు. అబ్బాపూర్ సర్పంచ్ స్థానానికి బీటెక్ చదివిన కచ్చు రమేశ్, జూలపల్లి సర్పంచ్ స్థానానికి డిగ్రీ చదివిన పాటకుల అనూష నామినేషన్లు దాఖలు చేశారు. వీరిద్దరి వయసు 23ఏళ్లలోపే. వివిధ గ్రామాలల్లోని వార్డుస్థానాలకు అత్యధికంగా ఈసారి 30ఏళ్ల వయసువారే నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం.
బ్యాలెట్ పేపర్‌పైనే ఓటు
● సర్పంచ్‌కు గులాబీ.. వార్డు మెంబర్‌కు తెలుపు
పెద్దపల్లిరూరల్: పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటుహక్కును బ్యాలెట్ పేపర్‌తోనే వినియోగించాల్సి ఉంటుంది. పోలింగ్ కేంద్రంలో ఓటరు వివరాలను సరిపోల్చుకున్న సిబ్బంది.. రెండు బ్యాలెట్ పత్రాలను అందిస్తారు. ఓటరు చేతికి ఇచ్చే బ్యాలెట్ పత్రాలు రెండు వేర్వేరు రంగుల్లో ఉంటాయి. వార్డు సభ్యుల బ్యాలెట్ పత్రం ‘తెలుపు’ రంగులో ఉంటుండగా.. సర్పంచ్ ఓటుకు ఇచ్చే బ్యాలెట్ పత్రం ‘గులాబీ’ రంగులో ఉంటుంది.
రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి
సుల్తానాబాద్‌రూరల్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామ శివారులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన వేల్పుల రఘురాం(15) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. సుల్తానాబాద్‌కు పని నిమిత్తం వచ్చి దివ్వచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన రఘురాం.. బైక్ అదుపు తప్పి కిందపడడంతో ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రెండుకార్లు ఢీ.. 8మందికి గాయాలు
తిమ్మాపూర్: రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఎల్‌ఎండీ పోలీసుల వివరాల ప్రకారం.. బెజ్జంకి మండల ఫ్లయింగ్ స్క్వాడ్ టీం కలికోట సంతోష్‌కుమార్, తోడెపు రమేశ్, తడకొండ కనకయ్య కారులో కరీంనగర్ నుంచి బెజ్జంకి వెళ్తున్నారు. కరీంనగర్‌లోని కట్టరాంపూర్‌కు చెందిన పెండ్యాల కిషన్‌రెడ్డి భార్య విజయ, కోడలు దివ్య, ఇద్దరు మనవలతో కారులో హైదరాబాద్ నుంచి కరీంనగర్ వసతఉన్నారు. తిమ్మాపూర్ పరిధిలోని ఇందిరానగర్ స్టేజీ సమీపంలో కిషన్‌రెడ్డి కారు అదుపు తప్పి డివైడర్ దాటి రాంగ్ రూట్‌లో ఫ్లైయింగ్ స్క్వాడ్ టీం కారును ఢీ కొట్టింది. రెండు కార్లు రోడ్డుపక్కనున్న కల్వర్టులోకి దూసుకెళ్లాయి. అందరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు చిన్నారులు స్పహ కోల్పోగా రోడ్డుపై వెళ్తున్న బస్సు కండక్టర్ సీపీఆర్ చేశాడు. మరో పసి బాలుడు తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించారు.
పాటకుల ఆనూష
బరిలో విద్యావంతులు


