102 వాహనం లేక బాలింత అవస్థలు
జగిత్యాల: జిల్లాకేంద్రంలోని ఎంసీహెచ్ ఆస్పత్రిలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన సరోజ వారం క్రితం డెలివరీ కోసం వచ్చింది. సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. అయితే బాలింతను ఇంటి వద్ద దింపేందుకు 102వాహనం అందుబాటులో లేకపోవడంతో సుమారు రెండు గంటల పాటు వేచిచూసింది. వాస్తవానికి తల్లీబిడ్డను క్షేమంగా 102లో వారి సొంత గ్రామంలో ఇంటి వద్ద దింపి రావాలి. సమాచారం ఇచ్చినా సిబ్బంది మాత్రం రాకపోవడంతో ఏమీ చేయలేక చివరికి అద్దె వాహనంలో ఉట్నూరు వెళ్లారు. ఈ విషయంపై డీఎంహెచ్‌వోను వివరణ కోరగా.. ఇతర జిల్లాకు వెళ్లాల్సి ఉన్నందున సమయం పడుతుందని.. అదే సమయంలో 102 సిబ్బంది సమీపంలోని ఓ బాలింతను తీసుకెళ్లిందని, అందుకే కొంత ఆలస్యమైందని తెలిపారు.


