బిల్లులు రాక ఇబ్బందిపడుతున్న
సర్పంచ్‌గా పనిచేసిన హయాంలో రూ.20 లక్షల నిధులు రావాల్సి ఉంది. ఎమ్మెల్యే కోటా కింద గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేసిన. పెండింగ్ బిల్లులు ఇప్పటికీ క్లియర్ కాలేదు. సర్పంచ్‌ల బిల్లులను క్లియర్ చేయడంలో గత ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది.
– నేరేళ్ల మహేందర్‌గౌడ్, మాజీ సర్పంచ్, చెల్పూర్
గ్రామంలో సర్పంచ్‌గా పనిచేసిన సమయంలో అప్పు చేసి అభివృద్ధి పనులు చేసిన. రూ.13 లక్షలకు సంబంధించిన చెక్కులు మంజూరైనా గ్రామపంచాయతీ ఖాతాల్లో నిధులు లేకపోవడంతో చెక్కులు నిలిచిపోయాయి. మొత్తం రూ.17 లక్షల నిధులు రావాల్సి ఉంది.
– బింగి కరుణాకర్, మాజీ సర్పంచ్, రంగాపూర్
బిల్లులు రాక ఇబ్బందిపడుతున్న


