పోస్టాఫీస్ ఖాతాలే..
బోయినపల్లి సబ్ పోస్టాఫీస్ వద్ద ఖాతాలు తీసుకుంటున్న పలువురు
బోయినపల్లి(చొప్పదండి): గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డుసభ్యుల స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ఖర్చు నిర్వహణకు జాతీయ బ్యాంకులో ఖాతా తెరవాలనే నిబంధనను ఎన్నికల కమిషన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో పలువురు అభ్యర్థులు జాతీయ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచేందుకు వెళ్లగా.. వారు జీరో ఖాతాలు ఇవ్వడం లేదు. దీంతో పలువురు పోస్టాఫీస్‌లో ఖాతాలు తెరుస్తున్నారు. సోమవారం ఒక్క రోజే బోయినపల్లి సబ్ పోస్టాఫీస్‌లో 60 వరకు కొత్త ఖాతాలు తెరిచినట్లు పోస్టల్ అధికారులు తెలిపారు. ఇంకా చాలా మంది దరఖాస్తు చేసుకున్నారని, వారందరికీ మంగళవారం ఇస్తామని చెప్పారు.
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్‌కు చెందిన గుండ బీమలింగం (59) సోమవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు రూరల్ ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. బీమలింగం మద్యానికి బానిసయ్యాడు. మద్యం మానలేకపోతున్నాననే మానసిక వేధనతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య లింగవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
● రైలు ఢీకొని ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
కరీంనగర్‌రూరల్: గుజరాత్ రాష్ట్రంలో జరిగిన రైలు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతిచెందడంతో స్వగ్రామం బొమ్మకల్‌లో విషాదం నెలకొంది. స్థానికుల కథనం ప్రకారం.. బొమ్మకల్‌కు చెందిన గన్ను రాజిరెడ్డి–సునీత దంపతుల కుమారుడు సాయి వర్ధన్‌రెడ్డి(20) గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో గల మార్వాడి యూనివర్సిటీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం ఉదయం తోటి విద్యార్థులతో కలిసి అవుటింగ్‌లో భాగంగా హాస్టల్ నుంచి బయటకు వెళ్లాడు. మధ్యాహ్నం 2గంటలకు తిరిగి హాస్టల్‌కు వస్తుండగా పట్టాలు దాటే క్రమంలో రైలు ఢీకొట్టింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కరీంనగర్ లయన్స్ క్లబ్ ప్రతినిధులు రాజ్‌కోట్‌లోని లయన్స్‌క్లబ్‌ను సంప్రదించగా సాయివర్ధన్‌రెడ్డి మృతదేహానికి సోమవారం పోస్ట్‌మార్టం చేయించి అంబులెన్స్‌లో బొమ్మకల్‌కు పంపించారు. మంగళవారం అంత్యక్రియలను నిర్వహిస్తారని కుటుంబసభ్యులు తెలిపారు.
పోస్టాఫీస్ ఖాతాలే..
పోస్టాఫీస్ ఖాతాలే..


