గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలి
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ టె క్నో స్కూల్‌లో మూడురోజులుగా నిర్వహించిన జి ల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన 2025–26, ఇన్‌స్పైర్ అవార్డ్స్ మనాక్ ప్రదర్శన సోమవారం ము గిసింది. జిల్లావ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి 807 నమూనాలు, 126 ఇన్‌స్సైర్ అవార్డ్స్ మనాక్ నమూనాలను ప్రదర్శించగా దాదాపు 176 పాఠశాలల నుంచి మొదటి రోజు 1,600 మంది, రెండో రోజు 2,652 మంది, చివరి రోజు 5,357 మంది విద్యార్థులు సందర్శించారు. ఇందులో 13 నమూనాలు రాష్ట్రాస్థాయి ఇన్‌స్పైర్ అవార్డ్స్ మనాక్‌కు ఎంపికయ్యాయి. జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో 7 సబ్‌థీమ్స్‌లో మొదటి స్థానం పొందిన నమూనాను రాష్ట్రస్థాయికి ఎంపిక చేసి జ్ఞాపికలు అందజేశారు. ఈసందర్భంగా డీఈవో శ్రీరాంమొండయ్య మాట్లాడుతూ, ప్రతి విద్యార్థిలో ఒక శాస్త్రవేత్త దాగి ఉన్నాడ ని, పట్టుదలతో పనిచేసి మానవాళి సంక్షేమానికి కొ త్త ఆవిష్కరణలు తీసుకురావాలని సూచించారు. అల్ఫోర్స్ చైర్మన్ డా.వి.నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థి దశనుంచే నూతన ఆవిష్కరణల దిశగా ఆ లోచనలు సాగాలని, గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగా లని పిలుపునిచ్చారు. జిల్లా సైన్స్ అధికారి చాడ జ యపాల్‌రెడ్డి, ఎస్.భగవంతయ్య, కర్ర అశోక్‌రెడ్డి, ఆంజనేయులు, మిల్కూరి శ్రీనివాస్, కృపారాణి, ఎంఈవోలు ఆనందం, ప్రభాకర్‌రెడ్డి, రవీంద్రాచా రి, రామయ్య, రవీందర్, గంగాధర్, అనంతాచార్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.


