రోడ్డు దాటితే ఊరు మారుడే..
మంథనిరూరల్: గీత దాటితే వేటు తప్పదు అనే మాటలు వింటూనే ఉంటాం.. కానీ ఇక్కడ రోడ్డు దాటితే ఊరు మారుతుంది. సాధారణంగా ఒక ఊరు నుంచి మరోఊరుకు కనీసం కిలోమీటరో రెండు కిలోమీటర్ల దూరమో ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం రోడ్డు మారితేనే మరో ఊరు ఉంటుంది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగారం ప్రధాన రహదారికి ఒకవైపు నాగారం ఉంటే మరోవైపు కన్నాల గ్రామపంచాయతీలోని పందులపల్లి ఉంటుంది. ఒకేచోట రెండు గ్రామపంచాయతీలకు చెందిన వారు ఉన్నా ఒక్క ఊరువాళ్లలాగే కలిసిమెలిసి ఉంటారు. కానీ ఎన్నికల సమయం వస్తే మాత్రమే రెండు గ్రామపంచాయతీలని తెలుస్తుంది. అయితే సర్పంచ్ ఎన్నికలు వస్తే మాత్రం రోడ్డు ఇవతలివైపు వాళ్లు అవతలివైపు వాళ్లు బరిలో నిల్చుంటారు. ఎన్నికలు ముగిసే వరకు ఆ రహదారి పూర్తిగా హడావుడిగా ఉంటుంది. మళ్లీ ఎన్నికల తర్వాత ఒక ఊరులాగే కన్పించడం కొసమెరుపు.
ఒకే గ్రామం.. రెండు పంచాయతీలు


