ప్రత్యేక నిధులు విడుదల చేయాలి
కరీంనగర్‌టౌన్: ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప్రయోజనాల కోసం 2024 మార్చి నుంచి ఇప్పటివరకు ప్రత్యేక నిధులు విడుదల చేయాలని రేవా రాష్ట్ర కన్వీనర్ కోహెడ చంద్రమౌళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమావేశం సోమవారం కరీంనగర్ ఫిలింభవన్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ విరమణ పొందిన తర్వాత వెంటనే రావాల్సిన బకాయిలు అందక పెన్షనర్లు ఇబ్బందులు పడుతున్నారని, చాలామంది అనారోగ్యం పాలవుతూ చనిపోతున్నారని పేర్కొన్నారు. ఈ విషయమై పెన్షనర్ సంఘాలు గత నెల 17న హైదరాబాదులో ధర్నా చేపట్టగా, స్పందించిన ప్రభుత్వం రూ.707.30 కోట్లు రిలీజ్ చేయగా, కేవలం పదవిలో ఉన్నవారి పెండింగ్ బకాయిలకే సరిపోయాయని, పెన్షనర్లకు ఎలాంటి లాభం లేదన్నారు. ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ప్రధాన కార్యదర్శి సుంకిశాల ప్రభాకర్‌రావు, గద్దె జగదీశ్వర చారి, కనపర్తి దివాకరు, జగి త్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రామ్‌రెడ్డి, సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు సుధాకర్, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు రాములు తదితరులు పాల్గొన్నారు.


