బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్ అన్నారు. బుధవారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో తనకు కేటాయించిన చాంబర్‌లో కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు నిజామాబాద్‌లో పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్ చేతుల మీదుగా నియామకపత్రాన్ని అందుకున్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందరి సహకారంతో నగరపాలకసంస్థలో పాగా వేస్తామన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తనను నియమించిన పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యతలు చేపట్టిన అంజన్‌కుమార్‌ను సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి రహమత్ హుస్సేన్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, పొన్నం సత్యనారాయణ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, మాజీ కార్పొరేటర్లు బుచ్చిరెడ్డి, సరిళ్ల ప్రసాద్, రాజేందర్, ప్రకాష్, పడిశెట్టి భూమయ్య, శ్రీనివాస్, ఆకుల నర్సయ్య, నాయకులు ఎండీ తాజ్, సిరాజ్ హుస్సేన్, మడుపు మోహన్, రాచకొండ చక్రధర్‌రావు, లక్కాకుల సురేందర్‌రావు, చర్ల పద్మ, బోనాల శ్రీనివాస్, బాబు, అనిల్ కుమార్ గుప్తా, రెహమాన్, అమీర్, కిషన్, క్రాంతి, ఇమ్రాన్, ఘని, కల్పన పాల్గొన్నారు.


