గురువారం శ్రీ 27 శ్రీ నవంబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
న్యాయవాదుల ర్యాలీ
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ధర్నా
ఈపీఎఫ్, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం కరీంనగర్‌లోని పీఎఫ్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఏళ్లకేళ్లుగా సమస్యలు పరిష్కరించకపోవడంతో నిత్యజీవితం ఇబ్బందిగా మారిందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనలో సంఘం నాయకులు బి.రాజయ్య, ఎస్.బుచ్చిరెడ్డి, వి.రమణారావు, జేజే రత్నం, కె.చంద్రయ్య, బచన్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. – కరీంనగర్
జాతీయ న్యాయదినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా జడ్జి ఎస్.శివకుమార్ హాజరయ్యారు. రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లింగంపల్లి నాగరాజు,ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ కార్యదర్శి సిరికొండ శ్రీధర్ రావు న్యాయవాదులు ఈ.మధుసూదన్ రావు, ముత్యాల తిరుపతిరెడ్డి, కిరణ్ సింగ్, మహిళా న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
– కరీంనగర్‌క్రైం
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా బుధవారం కార్మికసంఘాల ఆధ్వర్యంలో నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వర్ణ వెంకట్ రెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి గీట్ల ముకుంద రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వడ్ల రాజు మాట్లాడారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఉప్పునూటి శ్రీనివాస్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మిల్కూరి వాసుదేవరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి అజయ్ తదితరులు పాల్గొన్నారు. – కరీంనగర్‌టౌన్
గురువారం శ్రీ 27 శ్రీ నవంబర్ శ్రీ 2025
గురువారం శ్రీ 27 శ్రీ నవంబర్ శ్రీ 2025
గురువారం శ్రీ 27 శ్రీ నవంబర్ శ్రీ 2025


