
స్వగ్రామానికి మృతదేహాలు
రామడుగు/మేడిపల్లి: ఉపాధి కోసం ఒకరు.. ఉన్నత చదువుల కోసం మరొకరు విదేశాలకు వెళ్లి.. ఇటీవల గుండెపోటుతో మృతిచెందగా, వారి మృతదేహాలను ఆదివారం స్వగ్రామాలకు తీసుకొచ్చారు. వివరాలు.. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్‌రావుపేట గ్రామానికి చెందిన ఎలగుందుల ప్రకాశ్ (35) కొద్దిరోజులుగా దుబాయ్‌లో కంపెనీలో కాకుండా కలివెల్లిగా జీవనం సాగించాడు. ఇటీవల గుండెపోటుతో మృతిచెందాడు. అతడి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడం కష్టంగా మారింది. దీంతో కుటుంబ సభ్యులతోపాటు, బీఆర్‌ఎస్ నాయకులు పూడురి మల్లేశం, దుబాయి ఎల్లాల శ్రీనన్న సేవా సమితి సభ్యులు చిలుముల రమేశ్‌కు తెలిపారు. ఈక్రమంలో రమేశ్ సేవా సమితి అధ్యక్షుడు రవిడేవిడ్‌కు తెలియజేయడంతో దుబాయ్‌లోని ఇండియన్ అసోసియేషన్ వారితో మాట్లాడారు. దీంతో ప్రకాశ్ మృతదేహాన్ని ఆదివారం స్వగ్రామానికి తీసుకురాగా, పలువురు శ్రద్ధాంజలి ఘటించారు.
ఉన్నత చదువుల కోసం వెళ్లి..
లండన్‌లో ఈనెల 3న గుండెపోటుతో చనిపోయిన జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన ఏనుగు మహేందర్‌రెడ్డి (26) మృతదేహాన్ని ఆదివారం స్వగ్రామానికి తీసుకొచ్చారు. ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన మహేందర్‌రెడ్డి విగతజీవిగా మారడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతడి తండ్రి రమేశ్‌రెడ్డి కాంగ్రెస్ మేడిపల్లి మండల అధ్యక్షుడు కావడంతో పెద్దసంఖ్యలో ప్రజలు, ప్రముఖులు మహేందర్‌రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్నారు.

స్వగ్రామానికి మృతదేహాలు