
ఖిలా చూసేందుకు వచ్చి.. ప్రమాదం బారిన పడి
శంకరపట్నం: శంకరపట్నం మండలం మొలంగూర్ ఖిలా సందర్శనకు వచ్చిన మధ్యప్రదేశ్‌కు చెందిన పర్యాటకురాలు అదుపుతప్పి పడిపోవడంతో కాలు విరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన దంపతులు ఆరుమాసాలుగా వివిధ పర్యాటన ప్రదేశాలు సందర్శిస్తున్నారు. ఆదివారం మొలంగూర్ ఖిలాకు వచ్చారు. ఖిలా కింద దూద్‌బావిని పరిశీలించారు. ఖిలా పైకి వెళ్లి అందాలు వీక్షిస్తున్న క్రమంలో అదుపుతప్పి పడిపోయింది. కాలు విరగడంతో గ్రామానికి చెందిన 10మంది యువకులు పైకి వెళ్లి సుమారు మూడు గంటలపాటు కష్టపడి మహిళను కిందకు మోసుకొచ్చారు. 108లో హుజూరాబాద్ ఆస్పత్రికి తరలించారు.
మొలంగూర్ ఖిలాపై విరిగిన పర్యాటకురాలి కాలు