దీపావళి పండుగలో ఎంత సరదా ఉందో ప్రమాదం కూడా అంతే ఉంది. గుండె జబ్బులున్న వారు భారీ శబ్దాలకు దూరంగా ఉండాలి. హార్ట్ అటాక్ వచ్చి కోలుకున్నవారు, పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ శబ్దాల వల్ల గుండె ఎక్కువగా కొట్టుకోవడం, బీపీ పెరగడం వంటివి ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. – డాక్టర్ జి.వెంకట్‌రెడ్డి,
జనరల్ మెడిసిన్, కరీంనగర్
టపాసులు కాల్చే సమయంలో గాయమైతే వెంటనే కాలిన గాయాలపై నీరు పోయాలి. ఎందుకంటే టపాసుల్లో ఉండే రసాయనాలు రక్తంలో కలిసి మరింత ప్రమాదానికి దోహ దం చేస్తాయి. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. బర్నాల్, సిల్వర్ సల్ఫైడెటేన్, ఫౌండేర్, అయోడిన్ లాంటి క్రిమ్‌లను దగ్గర ఉంచుకోవడం మంచిది.
– డాక్టర్ వి.సుమన్‌చందర్‌రావు, చర్మవ్యాధుల నిపుణుడు, కరీంనగర్
మనిషి వినికిడి శక్తి 20 నుంచి 60 డెసిబుల్స్ మాత్రమే. ప్రస్తుతం లభిస్తున్న బాంబులు 100 నుంచి 180 డెసిబుల్స్ శబ్దం చేసేవి. ఒక వేళ చెవి నొప్పి వచ్చినా, చెవి నుంచి రక్తం వచ్చినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. చెవిలో నీళ్లు, నూనె, ఇతర చెట్ల ఆకుల రసం పోయడం వంటివి చేయకూడదు.
– డాక్టర్ సీహెచ్.రమణాచారి, ఈఎన్‌టీ నిపుణుడు, కరీంనగర్
గుండెజబ్బులవారు జాగ్రత్తగా ఉండాలి
గుండెజబ్బులవారు జాగ్రత్తగా ఉండాలి