
ఆరోగ్యమే నిజమైన ఆస్తి
కరీంనగర్‌టౌన్: ఆరోగ్యమే మనిషికి నిజమైన ఆస్తి అని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినో త్సవం సందర్భంగా శుక్రవారం డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి ర్యాలీని నిర్వహించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. ఏటా అక్టోబర్ 10న జరుపుకునే ప్రపంచ మానసిక దినోత్స వం మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడానికి ఉపయోగపడుతుందన్నారు. మానసిక రుగ్మతల విముక్తికి 14416 టోల్ ఫ్రీ నంబర్‌ను ఉపయోగించుకొని తగిన పరిష్కా రం పొందాలని సూచించారు. డాక్టర్లు విప్లవ శ్రీ, పృథ్వీ, ఉమాశ్రీ, సన జవేరియా, రాజగో పాల్, పోచయ్య, రమణాకర్ పాల్గొన్నారు.
సైన్స్‌కు కళను జోడించాలి
కరీంనగర్: సైన్స్‌కు కళను జోడిస్తే విద్యార్థులు మరింత ప్రతిభావంతులుగా తయారవుతారని డీఈవో శ్రీరాం మొండయ్య అన్నారు. నగరంలోని కళాభారతిలో శుక్రవారం పాఠశాల విద్యాశాఖ జిల్లాస్థాయి ‘సైన్స్ డ్రామా’ ఫెస్టివల్‌ను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. జిల్లా సైన్స్ అధికారి జయపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రీయ విద్యా పరిశోధన సంస్థ తెలంగాణ ఆదేశాల మేరకు మానవ పురోగతికి సైన్స్ అండ్ టెక్నాలజీ అంశంపై విద్యార్థులకు ఈ డ్రామా ఫెస్టివల్ నిర్వహించినట్లు తెలి పారు. 34 పాఠశాల నుంచి విద్యార్థులు పాల్గొనగా.. మొదటి బహుమతి భగత్‌నగర్ అల్ఫో ర్స్ హైస్కూల్, ద్వితీయ బహుమతి తిమ్మాపూర్ కేజీబీవీ, తృతీయ బహుమతి మానేరు సెంట్రల్ సాధించాయి. మొదటి బహుమతి పొందిన పాఠశాల రాష్ట్రస్థాయికి వెళ్తుందని సైన్స్ అధికారి తెలిపారు.
రిజర్వేషన్లపై మీ వైఖరి ఏమిటి?
చిగురుమామిడి: బీసీ రిజర్వేషన్ల్‌పై బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు స్పష్టమైన వైఖరి వెల్లడించకపోవడం దుర్మార్గమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. చిగురుమామిడిలో శుక్రవారం మాట్లాడుతూ.. స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడంతో రూ.3వేలకోట్లకు పైగా నిధులు వెనక్కి వెళ్లిపోయాయని అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా చిగురుమామిడిలో ఎర్ర జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు అందె చిన్నస్వామి, జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందెస్వామి, మండల కార్యదర్శి లక్ష్మారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్, లక్ష్మి, శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.
పందుల నుంచి కాపాడండి
గంగాధర: పందుల బెడద నుంచి పంటపొలాలను కాపాడాలని కోరుతూ గంగాధర గ్రామానికి చెందిన రైతులు శుక్రవారం మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. అడవి పందులతో పాటు, ఊర పందులు పంట పొలాలను నాశనం చేస్తున్నాయని అన్నారు. పంట చేనుల వద్ద కాపలా ఉన్నా, వాటి దాడులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుంపులు, గుంపులుగా పంట చేనులపై దాడులు చేస్తున్నాయన్నారు.

ఆరోగ్యమే నిజమైన ఆస్తి

ఆరోగ్యమే నిజమైన ఆస్తి