
పనిచేయబోమన్న వలస కార్మికులు
సుల్తానాబాద్‌రూరల్: ఇటుక బట్టిల్లో పనిచేసేందుకు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వలస కార్మికులు.. తాము ఇటుకబట్టిల్లో పనిచేయబోమని వెల్లడించారు. ఈమేరకు శుక్రవారం తిరుగు ప్రయాణమయ్యారు. అధికార యంత్రాంగం స్పదించి వారిని స్వస్థలాలకు పంపించింది. అధికారుల కథనం ప్రకారం.. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి పరిధిలోని ఆనందరావుకు చెందిన ఇటుక బట్టీల్లో పనిచేసేందుకు ఈనెల 2న 28 మంది ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కార్మికులు వచ్చారు. ఇక్కడ బస చేయగా.. వారికి వంట చేసుకొని తినేందుకు యాజ మాని డబ్బులు ఇవ్వలేదు. ఈ విషయంపై కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసు, లేబర్ ఆఫీ సర్, రెవెన్యూ అధికారులు శుక్రవారం వలసకూలీల వివరాలు సేకరించారు. వారిని రైలు మార్గం ద్వారా స్వస్థలాలకు పంపించివేశారు. గురువారం కొమండ్లపల్లి పరిధిలోని ఓ ఇటుక బట్టీ వలస కార్మికులు తిరుగుప్రయాణం కాగా.. గుట్టుచప్పుడు కాకుండా స్వస్థలాలకు పంపించినట్లు సమాచారం.