
‘ఇందిరమ్మ’ బిల్లు మంజూరుకు లంచం డిమాండ్
● ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
గంగాధర: గంగాధర మండలం మధురానగర్ గ్రామ కార్యదర్శి మునిగఅనిల్ రూ.10వేలు లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీకి చిక్కాడు. డీఎస్పీ విజయ్‌కుమార్ వివరాల ప్రకారం.. మధురానగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పత్తికుంటపల్లికి చెందిన ఓ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులుడికి బిల్లు మంజూరు చేసేందుకు పంచాయతీ కార్యదర్శి మునిగఅనిల్ రూ.10వేలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి మునిగఅనిల్‌కు రూ.10వేలు ఇస్తుండగా అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కేసు నమోదు చేశారు. బిల్లుల మంజూరు కోసం ప్రభుత్వ అధికారులు లంచం అడిగినా, దీపావళి మామూళ్లు అడిగినా, అనుమతుల కోసం డబ్బులు డిమాండ్ చేసినా 1064 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని డీఎస్పీ సూచించారు. దాడిలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు తిరుపతి, కృష్ణకుమార్ పాల్గొన్నారు.