
కరీంనగర్ కవిత్వ వారసత్వాన్ని కొనసాగించాలి
కరీంనగర్ కల్చరల్: క్రీస్తుపూర్వం నుంచి క్రీస్తు శకం వరకు కరీంనగర్ సాహిత్య వారసత్వం ఘనమైందని, దానిని కొనసాగించాల్సిన బాధ్యత నేటి తరం కవులకు ఉందని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ నలిమెల భాస్కర్ అన్నారు. తెలంగాణ రచయితల వేదిక కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి జరిగిన 150వ ఎన్నిల ముచ్చట్లు సాహిత్య కార్యక్రమంలో మాట్లాడారు. ఆధునికత అవసరమే గాని మన చరిత్రను తెలుసుకోకుండా వట్టి ఆధునికత వెంట వెళ్లడం సమాజానికి మంచిది కాదన్నారు. సభ ప్రారంభంలో ఆదివాసీ వీరుడు కొమరం భీమ్, నిస్వార్ధ ఐఏఎస్ అధికారి శంకరన్‌లకు నివాళి అర్పించింది. సమకాలీన సమస్యలపై కవిత గానం చేశారు. తెరవే జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సీవీ కుమార్, శంకరయ్య, సంతోశ్ బాబు, సీఎస్ రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు.