వ్యర్థాల ప్రాసెస్‌కే కొత్త టెండరు | - | Sakshi
Sakshi News home page

వ్యర్థాల ప్రాసెస్‌కే కొత్త టెండరు

Oct 7 2025 3:45 AM | Updated on Oct 7 2025 3:44 PM

కరీంనగర్‌ కార్పొరేషన్‌

వ్యర్థాల ప్రాసెస్‌కే కొత్త టెండరు

అగ్రిమెంట్‌లో భాగంగా కంపెనీలు చేయాల్సిన పనులు

రెండోసారి రూ.2 కోట్ల ఎస్బీఎం 2.0 నిధులు

ముందుచూపు, ప్రణాళిక లేకుండానే ముందడుగా..?

పూర్తికాని రూ.16.50 కోట్ల పాత పనులు, తొలగించని యంత్రాలు

సామర్థ్యం లేదంటూ కొత్త కాంట్రాక్టర్‌ కోసం వెతుకులాట

నిధులు సద్వినియోగం చేసుకోవడం లేదని విమర్శలు

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌:

గరశివారులో డంప్‌యార్డ్‌ వ్యర్థాల ప్రాసెస్‌ కోసం బల్దియా టెండర్‌ పిలిచింది. స్వచ్ఛ భారత్‌ మిషన్‌ అర్బన్‌ 2.0 నిధుల కింద ఈ టెండరును పిలిచారు. 2022లో ఇదే డంప్‌యార్డ్‌లో వ్యర్థాలను ప్రాసెస్‌ చేసేందుకు రూ.16.50 కోట్లతో టెండరు అప్పగించిన కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మరోసారి టెండరు పిలవడంలో ఆంతర్యమేంటో అంతుచిక్కడం లేదు. పాత కాంట్రాక్టర్‌ గడువు ఇంకా మిగిలి ఉండగానే.. మరో కాంట్రాక్టర్‌ టెండరు ఇచ్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. దీనిని సమర్థించుకునేందుకు బల్దియా అధికారులు కొత్తరాగం అందుకుంటున్నారు. పాత కాంట్రాక్టర్‌ చేయాల్సిన పని ఇంకా మిగిలి ఉందని, ఈలోగా మరింత చెత్త పేరుకుపోయింది కాబట్టి కొత్త టెండరు పిలిచామని వివరణ ఇస్తున్నారు. ఇదంతా కేవలం నగరంలో ఎంత చెత్త ఉత్పత్తి అవుతుంది? అన్న విషయంలో అధికారులకు అవగాహన లేకనే నిధులను సద్వినియోగం చేసుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.

ఏం జరిగిందంటే?

నగరంలోని డంప్‌యార్డ్‌లో పేరుకుపోయిన చెత్తను ప్రాసెస్‌ చేసేందుకు నాల్గో బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ మీటింగ్‌లో బయోమైనింగ్‌ అనే స్మార్ట్‌ సిటీ ప్రక్రియకు బీ జం పడింది. ఇందులో ప్లాస్టిక్‌, సేంద్రియ వ్యర్థాలను వేరు చేసేందుకు మెట్రిక్‌ టన్నుకు రూ.570 చొ ప్పున స్కాడా (సూపర్‌వైజరీ కంట్రోల్‌ అండ్‌ డేటా అకైవజేషన్‌) విధానం సాయంతో చెల్లించేందుకు కరీంనగర్‌ కార్పొరేషన్‌ సిద్ధమైంది. ఇందుకోసం రూ.16.50 కోట్ల స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా ని ధులు కేటాయించి హర్షితా ఇన్‌ఫ్రా కంపెనీ సిరి కన్‌స్ట్రక్షన్స్‌ అండ్‌ డీఎం సొల్యూషన్స్‌తో కలిసి సంయుక్త భాగస్వాములుగా ఏర్పడ్డారు. వీరే టెండరు దక్కించుకుని 2022, మే 22న స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుతో ఒప్పందం కుదుర్చుకున్నారు. 

ఒప్పందంలో భాగంగా టెండరు దక్కించుకున్న కంపెనీలు కరీంనగర్‌లోని ఆటోనగర్‌లో ఉన్న డంప్‌యార్డ్‌లో గత 20 ఏళ్లలో తొమ్మిది ఎకరాల్లో 9 నుంచి 10 మీటర్ల ఎత్తున పేరుకుపోయి ఉన్న 0.2 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలను తొలగించాల్సి ఉంది. కానీ, 2022లో టెండరు దక్కించుకున్న కంపెనీకి 2 లక్షల మెట్రిక్‌ టన్నులు ప్రాసెస్‌ చేసేందుకు టెండరు ఇచ్చామని బల్దియా అధికారులు చెబుతుండడం గమనార్హం. ప్రస్తుతం ఇక్కడ కొన్నినెలలుగా బయోమైనింగ్‌ పనులు నిలిచిపోయాయి. అధికారులు మాత్రం దీనిపై స్పందిస్తూ.. వర్షాకాలంలో మినహాయింపు ఉంటుందని చెబుతుండడం కొసమెరుపు.

బయోమైనింగ్‌ కోసం పాత టెండరు కేవలం 2 లక్షల మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలు ప్రాసెస్‌ చేసేందుకు అప్పగించాం. దాన్ని ఈ ఏడాది డిసెంబరు వరకు పొడిగించాం. వాస్తవానికి అక్కడ 4 లక్షల మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలు పోగయ్యాయి. ఇవి మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక తాజాగా పిలిచిన రూ.2 కోట్ల టెండరు అదనంగా మరో 20 వేల మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలను ప్రాసెస్‌ చేసేందుకు పిలిచాం. వర్షాకాలం కాబట్టి పాత కాంట్రాక్టర్‌కు పనులు చేయడం వీలు కావడం లేదు. 
– ఓం ప్రకాశ్‌, డీఈ

వ్యర్థాలను తరలించే వాహనాల బరువును కొలిచేందుకు సర్వర్‌ కనెక్టివిటీతో కూడిన కాంటా

సీసీటీవీ, ఆటోమేటెడ్‌ నంబరుప్లేట్‌ రికగ్నిషన్‌ కెమెరా, స్క్రీనింగ్‌ సిస్టమ్‌

అగ్ని ప్రమాద నివారణ వ్యవస్థ, వరద నీరు సాఫీగా వెళ్లేందుకు తాత్కాలిక డ్రెయినేజీల నిర్మాణం

దుర్వాసన, పొగను నివారించే వ్యవస్థ

తాత్కాలిక షెడ్‌ నిర్మాణం

వ్యర్థాల తీవ్రత తగ్గించే ప్లాంట్‌

స్కాడా విధానం.. (సూపర్‌వైజరీ కంట్రోల్‌ అండ్‌ డేటా అకైవజేషన్‌ ) ఈ విధానంలో వాహనాలను ఆర్‌ఎఫ్‌ఐడీ ద్వారా రాకపోకలు, తూకాలను సులువుగా గుర్తించాలి.

నిబంధనల ప్రకారం అక్కడ పై సదుపాయాలన్నీ పక్కాగా ఉండాలి. కానీ.. అవన్నీ అరకొరగా ఉండడం కొసమెరుపు.

కరీంనగర్‌ కార్పొరేషన్‌1
1/1

వ్యర్థాల ప్రాసెస్‌కే కొత్త టెండరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement